Read more!

విద్యని ఖర్చుపెడితే

 

 

విద్యని ఖర్చుపెడితే

 

 

న చోరహార్యం న చ రాజహార్యం

న భ్రాతృభాజ్యం న చ బారకారి

వ్యయేకృతే వర్ధత ఏవ నిత్యం

విద్యాధనం సర్వధన ప్రధానమ్

విద్యని దొంగలు దోచుకోలేరు; రాజులు పన్ను విధించలేరు; అన్నదమ్ములు తమ వాటా అని చెప్పి పంచుకోలేరు. ఇలాంటి విద్య ఎప్పటికీ భారం కాదు. ఆ విద్యని ఖర్చుపెట్టే కొద్దీ పెరుగుతుందే కానీ తరగదు. అందువలన అన్ని ధనాలలోకీ విద్య అనే ధనమే ప్రధానమైనది.