Indian Sages and Astronomy
మన ఋషులు ఖగోళ శాస్త్ర పండితులు
Indian Sages and Astronomy
సూర్యుడు, నక్షత్రాలు, నక్షత్ర కూటాలు, గ్రహాలు తదితర అంశాలకు సంబంధించిన ఖగోళశాస్త్రం అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో మనకు ఆకాశంలోని అనేక విషయాల గురించి కూలంకషంగా తెలుసు. కానీ చిత్రం ఏమిటంటే, ఏ సాంకేతిక పరిజ్ఞానం లేకముందే, గెలీలియో (Italian Astronomer Galileo) లాంటి ఖగోళ శాస్త్రజ్ఞులు టెలిస్కోపు లాంటి సాంకేతిక సాధనాలను, శాస్త్రీయ పరికరాలను కనిపెట్టడం కంటే ముందుగానే మన మహర్షులు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలకు సంబంధించిన అనేక విషయాలను తమ దార్శనిక దృష్టితో చూసి, విశ్లేషించి చెప్పారు.
సూర్యుడు ఉదయించడం, అస్తమించడం అంటూ జరగదని, భూభ్రమణంవల్ల అలా ఉదయించినట్లు, అస్తమించినట్లు భ్రమ కలుగుతుందని ఋగ్వేదంలో లిఖితమై ఉంది.
భూమికి ఆకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది న్యూటన్ అనుకుంటాం. కానీ, అది సరికాదు. భాస్కరాచార్యులు ఎప్పుడో 12వ శతాబ్దంలోనే భూమికి ఆకర్షణ శక్తి ఉందని సూత్రీకరణ చేసి చెప్పారు.
భూమి తనచుట్టూ తాను తిరుగుతుందని మొదట దర్శించింది ఆర్యభట్టు. ఈ మహనీయుడు సూర్యచంద్ర గ్రహణాలను గురించి కూడా బోధపరిచాడు.
చంద్రుడి గురించి మొట్టమొదట పరిశోధనలు చేసింది వరాహమిహిరుడు. చంద్ర భ్రమణ కక్ష్య కారణంగా చంద్రుని ఒక దిశ ప్రకాశవంతంగా ఉంటుందని, రెండో దశ చీకటిగా ఉంటుందని వరాహమిహిరుడు సూత్రీకరించాడు.
ఇకపోతే అధర్వణ వేదంలో -
''సప్త సూర్యస్య రశ్మయః'' అనే మంత్రం ఉంది. ఈ మంత్రానికి సూర్య కిరణాలు ఏడు రకాలు'' అని అర్ధం.
Indian Sages are scientists, hindu sages theory, hindu sages tremendous knowledge, sages and Astronomy