Coconut in hindu puja
పూజలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు?
Coconut in hindu puja
ఇంట్లో పూజ చేసినా, గుళ్ళో దేవుడి దర్శనానికి వెళ్ళినా కొబ్బరికాయ కొట్టడం ఆచారం. ఎవరికి వారిమే కొబ్బరికాయ కొడతాం కానీ, ఎందుకో మాత్రం మనలో చాలామందికి తెలీదు. అందుకే కొబ్బరికాయ కొట్టడం వెనుక ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం.
ఆలోచించి చూస్తే, ప్రతి ఆచారం వెనుకా కారణం ఉంటుంది. దేవుడి పూజలో కొబ్బరికాయ కొట్టి, ఆ నీటితో దేవునికి అభిషేకం చేయడం వెనుక కూడా అర్ధం, పరమార్థం ఉన్నాయి. ఇతర పండ్లు, మిఠాయిలతో పోల్చినప్పుడు అరటిపండు, కొబ్బరికాయ చవగ్గా ఉంటాయి. పేద, ధనిక బేధం లేకుండా అందరూ దేవునికి నివేదించడానికి వీలుగా ఉంటుంది కనుక ఈ రెండిటినీ నైవేద్యంగా ఉపదేశించారు. పైగా కొబ్బరికాయ, అరటిపండు - రెండూ కూడా అన్ని కాలాల్లో, అన్ని ప్రాంతాల్లో లభ్యమౌతాయి. ఇది రెండో కారణం. ఇకపోతే నారీకేళం మరెన్నో విశిష్టతలు గలది. అవేంటో చూద్దాం.
కొబ్బరికాయ మూడు భాగాలుగా కనిపిస్తూ ఉండగా ఒక భాగం పెద్దగా ఉంటుంది. దానికి ఎదురుగా రెండు సమ భాగాలు ఉంటాయి. ఆ రెండు బాగాల్లో
కుడివైపు భాగాన్ని సూర్యనాడి అని
ఎడమవైపు భాగాన్ని చంద్రనాడి అని
రెండు భాగాలకు మధ్య ఉన్న పెద్ద భాగాన్ని బ్రహ్మనాడి అని అంటారు. ఏ భాగంలో ఉన్న కన్నును ఆ నాడీ కేంద్రం అంటారు.
సూర్య, చంద్ర, బ్రహ్మ నాడులు కలిసినప్పుడే జ్ఞానం కలుగుతుంది. బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు ఆత్మ, పరమాత్మలో కలిసిపోతుంది. అంటే మోక్షం కలుగుతుంది. ఉజ తర్వాత చావుపుట్టుకలు ఉండవు.
సూర్య, చంద్ర బ్రహ్మ నాడులను ఏకం చేసిన వ్యక్తి యోగి. కొబ్బరికాయకు మూడు కన్నులు ఉన్నచోట కొంత పీచును అట్టిపెట్టడంలో పరమార్ధం అదే. మూడు భాగాలనూ ఆ పీచు కలుపుతూ ఉంటుందన్నమాట. ఆవిధంగా యోగత్వానికి, బ్రహ్మజ్ఞానానికి సంకేతం.
దేవుడికి కొబ్బరికాయ కొట్టేముందు చుట్టూ పీచు తీస్తారు. కానీ చివర్లో కొంత పీచు అలా ఉంచేస్తారు. ఇలా కొంత పీచును ఉంచడం వెనుక కారణం ఉంది. కాయకు నిలువుగా మూడు చారలు కనిపిస్తాయి. ఆ మూడు భాగాలకూ మూడు కళ్ళు ఉంటాయి. కొబ్బరికాయకు ఉండే ఈ మూడు కళ్ళను దృష్టిలో ఉంచుకుని ''ముక్కంటి'' అంటారు.
కొబ్బరి నీళ్ళలో దివ్య ఔషధాలు ఉన్నాయి. దాహం తీర్చ్గడమే గాక ఇందులో ఉండే మినరల్స్ శరీరానికి మేలు చేస్తాయి. ఇందులో రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉంది. కొబ్బరి నీళ్ళు సేవించడం వల్ల అనేక రోగాలు దరికి రావు. వాత, పిత్త గుణాలను హరిస్తాయి. వేడిని తగ్గిస్తాయి. విరేచనాలను అరికడతాయి. గుండె జబ్బులను తగ్గిస్తాయి. అన్నిటినీ మించి, శక్తిని, బలాన్ని అందిస్తాయి. కొబ్బరికాయలో ఉండే అమూల్యమైన గుణాలతో పోలిస్తే, దీని ఖరీదు చాలా తక్కువ.
దేవుని ఎదుట కొబ్బరికాయ కొట్టి, ఆ నీటితో అభిషేకం చేయమని ఉపదేశించారు పెద్దలు. ఈ ఆచారం వెనుక ప్రతిరోజూ కొబ్బరినీటిని సేవించడమే సిసలైన రహస్యం. అలా ఎన్నో సుగుణాలు ఉన్నందువల్లనే పూజలో కొబ్బరికాయ ముఖ్య పాత్ర వహిస్తోంది.
కొబ్బరి నీటితో దేవునికి అభిషేకం చేసిన తర్వాత, ఆ నీటిని తీర్థంగా ఇస్తారు. అభిషేకం చేసిన తర్వాతనే ఎందుకు, మామూలుగా కొబ్బరికాయ కొట్టి , ఆ నీటిని తాగకూడదా అనే సందేహం వస్తుంది. అలా తాగినా కొబ్బరి నీళ్ళలో ఉండే పోషకాలు తప్పకుండా మేలు చేస్తాయి. అయితే సాలగ్రామాలు, పవిత్రమైన దేవుని విగ్రహాలను అభిషేకించిన కొబ్బరి నీళ్ళు మరింత ప్రయోజనకరమైనవి. అవి ఇంకా హితవు చేస్తాయి. కనుకనే కొబ్బరినీళ్ళతో దేవునికి అభిషేకం చేసి, తర్వాత ఆ నీటిని తీర్ధంగా సేవిస్తున్నాం.
పూజలు, వ్రతాల్లోనే కాదు, కలశం, తాంబూలం మొదలైనవాటిల్లోనూ కొబ్బరికాయ స్థానం విశిష్టమైంది.
దాదాపు మన ఆచారాలు అన్నిటిలో శాస్త్రీయత దాగి ఉంది. కానీ ఒకప్పుడు ''ఈ పని చేస్తే, ఈ ప్రయోజనం కలుగుతుంది..'' అని చెప్పకుండా ''ఇలా చేయండి.. అలా చేయొద్దు'' అని మాత్రమే చెప్పేవారు. అదొక ఆచారంగా కొనసాగితేనే మంచిదని, ఉపయోగాలు ఉంటాయని చెప్తే ఎక్కువమంది బద్ధకిస్తారనేది పెద్దల ఉద్దేశం. అయితే, అలా శాసించడం వల్ల కొందరు వాటిని మూఢ నమ్మకాలు అని నిరసించడం జరుగుతోంది.
పూజలో కొబ్బరికాయను పీచు మిగిల్చినవైపు మన వైపుకు పట్టుకుని గోళాకారంలో ఉన్న కాయ మధ్యలో భాగం తాకేటట్లు పగలగొట్టాలి. కొబ్బరికాయను తిన్నగా గచ్చుమీద పగలగొడితే మార్బుల్, గ్రానైట్, మొజాయిక్ లేదా టైల్సు పగుళ్ళు ఇచ్చే ప్రమాదం ఉంది. కనుక కొబ్బరికాయ కొట్టేందుకు సుత్తి లేదా పలుగురాతిని ఉపయోగించడం మంచిది.
importance of Coconut in hindu traditions, benefits of coconut in hindu prayer, coconut is auspicious in hindu puja, abhishekam with coconut water, coconut is good for health, coconut water and medicinal values