శ్రీగంధం, గోపీచందనం, అక్షతల విశిష్టత (Importance of Srigandham, Gopichandanam, Akshatas)

 

శ్రీగంధం, గోపీచందనం, అక్షతల విశిష్టత

(Importance of Srigandham, Gopichandanam, Akshatas)

 

శ్రీగంధం (Srigandham)

శ్రీగంధం శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. చలువ చేస్తుంది. శ్రీగంధం రక్తంలో ఏమైనా దోషాలు ఉంటే వాటిని పోగొడుతుంది. క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. పైత్య గుణాన్ని, తాపగుణాన్ని హరింపచేస్తుంది. చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పుండ్లు, దెబ్బలు లాంటివి ఏమైనా ఉంటే శ్రీగంధంతో తక్షణం నయమౌతాయి. శరీరానికి కాంతిని, కళ్ళకు మెరుపును ఇస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీగంధం తాజాదనాన్ని, తేజస్సును ఇవ్వడమే కాదు, గొప్ప బలాన్ని ఇస్తుంది. ఉష్ణాన్ని హరించడమే కాక దేహానికి మంచి సువాసనను తెస్తుంది. పూర్వం రోజుల్లో ఇప్పటిలా డియోడరెంట్లు, పర్ఫ్యూమ్లు లేవు. అప్పటివాళ్ళు తాజాదనం కోసం శరీరానికి శ్రీచందనాన్ని రాసుకునేవారు.

 

గోపీచందనం (Gopichandanam)

గోపీచందనం అంటే పచ్చటి మట్టి. శ్రీకృష్ణుని పాదాలతో పునీతమైన మట్టి. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తంలో ఉన్న దోషాలన్నిటినీ హరింపచేస్తుంది. ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది.ఈ ఎర్రమట్టి దివ్య ఔషధంలా పని చేస్తుంది కనుక కొందరు దీన్ని ఒళ్ళంతా పూసుకుని, ఓ గంటసేపు అలాగే ఉండి, తర్వాత స్నానం చేస్తారు. ఇప్పటికీ నేచర్ క్యూర్ సెంటర్లలో ఈ పద్ధతిని అమలుపరుస్తున్నారు. గోపీచందనం శరీరానికి, మనసుకు కూడా మంచిది. ఆరోగ్యాన్ని కుదుటపరిచి, మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది.


అక్షత (Akshata)

పసుపుకొమ్మును అరగదీసి, అందులో అరగదీసిన శ్రీగంధపు చెక్కను, కాల్చిన అరటిపూవు భస్మాన్ని కలిపి అక్షత తయారుచేస్తారు. పసుపుకొమ్ము అందుబాటులో లేకుంటే, శ్రీచూర్ణపు పసుపుతో కూడా అక్షతను తయారుచేయవచ్చు. ఇలా చేసిన అక్షత చాలా పవిత్రమైనవి. స్వచ్చమైన పసుపు శరీరానికి కాంతిని ఇస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కఫాన్ని తగ్గిస్తుంది. క్రిమినాశినిగా పనిచేస్తుంది. వాతగుణాన్ని హరింపచేస్తుంది.గాయాలు, వ్రణాలను తగ్గిస్తుంది.

 

Importance of Srigandham, Gopichandanam, Akshatas, Values of Srigandham, Gopichandanam, Akshatas, Srigandham, Gopichandanam, Akshatas in pooja