అబద్దాలు చెబుతున్నారా...అయితే ఈ పరిస్థితి తప్పదట..!
అబద్దాలు చెబుతున్నారా...అయితే ఈ పరిస్థితి తప్పదట..!
వెయ్యి అబద్దాలు ఆడి అయినా ఒక పెళ్లి చేయవచ్చు అనేది సాధారణంగా చెప్పుకునే మాట. అబద్దం చెప్పడం తప్పేం కాదు అనే విషయాన్ని స్పష్టం చేయడానికి ఇలాంటి వాక్యాలు వాడుతుంటారు. అయితే ఒక మంచి పని చేయడానికి, మంచిని రక్షించడానికి, నలుగురికి మేలు చేయడానికి అబద్దం చెప్పినా పర్లేదు.. కానీ కొందరికి అబద్దాలు చెప్పడం చాలా అలవాటుగా ఉంటుంది. అబద్దాలు చెప్పడం వల్ల స్వార్థం చూసుకోవడం, లాభపడటం జరుగుతూ ఉంటుంది. ఈ కారణంగా అబద్దాలు చెప్పి సుఖపడిపోతూ ఉంటారు. కానీ ఇలా అబద్దాలు చెప్పడం చెడ్డ అలవాటు అని చెప్పడం కాదు.. సాక్షాత్తూ ఆ శని మహాత్మునికి కోపం వస్తుంది అంట. అసలు అబద్దాలకు, శని మహాత్మునికి మద్య సంబంధం ఏంటి? అబద్దాలు చెబితే ఏం జరుగుతుంది తెలుసుకుంటే..
శని దేవుడికి అబద్దాలు చెప్పే వారంటే ఇష్టం ఉండదట. అబద్దాలు చెప్పేవారు శని దేవుడి దృష్టిలో పడతారట. వీరు ఆయన దృష్టి నుండి అస్సలు తప్పించుకోలేరట. ఆయన అబద్దాలు చెప్పేవారిని అస్సలు క్షమించలేడట.
అబద్దాలు చెప్పేవారికి శని దేవుడు భయంకరమైన శిక్షలు వేస్తాడని చెబుతున్నారు. శని దేవుడు న్యాయ దేవుడు అని అనడం వినే ఉంటారు. చేసిన పనుల తాలూకు కర్మను ఆయనే అమలు చేస్తాడు. అలాగే అబద్దాలు చెప్పే వారికి కూడా శిక్ష వేసేది శని దేవుడే.. అబద్దాలు చెప్పే అలవాటు ఉన్న వారికి శని దేవుడు జీవితాంతం బాధపడే.. ఇబ్బంది పడే శిక్షలు వేస్తాడని అంటున్నారు.
అబద్దాలు చెప్పి ఆ తరువాత అవన్నీ మర్చిపోయిన వ్యక్తులు కొందరు ఉంటారు. తరువాత కష్టపడుతున్నా సరే జీవితంలో ఎదుగుదల లేదని, కేరీర్ లో పురోగతి లేదని చెబుతుంటారు. ఇదంతా శని దేవుడు వేసిన శిక్ష తాలూకు ప్రబావమే.. కుటుంబ సభ్యుల మధ్య కూడా గొడవలు, కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు, మనుషుల మధ్య అంతర్యుద్దాలు వంటి పరిస్థితులు ఏర్పడతాయట.
ఏ పనులు మొదలు పెట్టినా ఆ పనులు చెడిపోవడం, పనులు మధ్యలోనే ఆగిపోవడం, నష్టం కలగడం వంటివి కూడా శని దేవుడు అసంతృప్తి కావడం వల్ల సంభవిస్తాయట. పనులు చెడిపోడం, జీవితంలో ఎదగలేకపోవడం జరుగుతుందట. అబద్దాలు ఆడితే శనిదేవుడి ప్రభావం ఇలాగే ఉంటుంది. అందుకే పొరపాటున కూడా అబద్దాలు అనేవి ఆడకూడదు.
*రూపశ్రీ.