కాలాష్టమి ఎప్పుడు...ఈ రోజు 4 పనులు చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయట..!

 

కాలాష్టమి ఎప్పుడు...ఈ రోజు 4 పనులు చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయట..!

 


కాశీ క్షేత్రానికి వెళ్లిన చాలా మంది కాలభైరవుడి దర్శనం చేసుకోకుండా వెనుదిరిగిరారు.  ఆయన కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడు.  కాశీ క్షేత్రానికి ఎలాంటి ఆపద రాకుండా కాపలా కాస్తుంటాడట. ఇక సాధారణ విషయానికి వస్తే కాలభైరవుడు శివుడు ఒక్క సారి కోపంలో హుంకరిస్తే ఆ హూంకారం నుండి పుట్టిన వాడు.  భయంకరమైన ఆకారంతో  నాలుగు చేతులతో ఉంటాడు.  శరీరం అగ్ని జ్వాలలా వెలుగుతూ ఉంటుంది. ఇలాంటి కాలభైరవుడిని కాలాష్టమి రోజు పూజిస్తారు. కష్టాలు తొలగిపోవడానికి,  జీవితంలో శత్రువులు నిశించడానికి,  ఎవరి కన్ను మీద పడకుండా ఉండటానికి కాలభైరవ పూజ చాలా సహాయపడుతుంది.

పంచాగం ప్రకారం కాలాష్టమి నవంబర్ 22వ తేదీన వచ్చింది. ఈరోజు చేసే కాలభైరవ పూజ చాలా ఉత్తమోత్తమైన ఫలితాలు ఇస్తుంది. జీవితంలో చాలా సమస్యలు దూరమవుతాయి.


కాలాష్టమి రోజు చేసే పూజలో కాలభైరవుడికి చందనం సమర్పించాలట.  ఇలా చేస్తే జీవితంలో వచ్చే కష్టాలు దూరమవుతాయట.

కాలష్టమి రోజు నెయ్యి దీపం వెలిగించడం వల్ల జీవితంలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందట.  వ్యక్తిగంగా జీవితంలో పురోగతి మొదలవుతుందట.


సాధారణంగా ఏ దైవ పూజలో అయినా సమర్పించే తమలపాకులు, పండ్లు,  పాయసం వంటివి కాలభైరవుడికి కూడా సమర్పించాలి.

కాలాష్టమి రోజున కాలభైరవుడికే కాకుండా శమీ వృక్షాన్ని దర్శించి శమీ వృక్షానికి నీరు సమర్పించాలి. ఇలా చేస్తే కాలభైరవుడు సంతోషిస్తాడట. కష్టాల నుండి గట్టెక్కిస్తాడని పండితుల అభిప్రాయం.


                                             *రూపశ్రీ.