ఓర్పే ఆయుధం
ఓర్పే ఆయుధం
నమ్రత్వేనోన్నమంతః పరగుణ కథనైః స్వాన్గుణాన్య్ఖాపయంతః
స్వార్థాన్సంపాదయంతో వితత పృథుతరారంభ యత్నాః పరార్థే ।
క్షాంత్యైవాక్షేప రూక్షాక్షర ముఖర ముఖా న్దుర్జనా న్దుఃఖయంతః
సంతః సాశ్చర్యచర్యా జగతి బహుమతాః కస్య నాభ్యర్చనీయాః ॥
వినయంతోనే సత్పురుషులు అంత ఎత్తున ఎదిగి కనిపిస్తారు. ఇతరులలోని మంచి లక్షణాలని కీర్తించడం వల్ల వారి సద్గుణాలే వెల్లడి అవుతాయి. ఇతరుల పనులు నెరవేర్చే క్రమంలో వారి కార్యాలూ నెరవేరతాయి. అలాంటి సత్పురుషులను దూషించేవారికి, వారి ఓర్పే ఆయుధంగా నిలుస్తుంది. అలాంటి పూజనీయులు జగతిలో తప్పకుండా పూజింపబడతారు.