అద్దంలో బొట్టులా...

 

 

 

అద్దంలో బొట్టులా...

 

 

తెలియని కార్య మెల్లఁ గడతేర్చుట కొక్కవివేకిఁ జేకొనన్

వలయునటైనదిద్దుకొనవచ్చుఁ బ్రయోజనమాంద్యమేమియుం

గలుగదు ఫాలమందుఁ దిలకం బిడునప్పుడు సేత నద్దమున్

గలిగినఁ జక్కఁ జేసికొనుగాదె నరుందిరి చూచి భాస్కరా!

 

తెలియని పనిని చేబూనినప్పుడు, ఆ రంగంలో నిష్ణాతులైనవారి సాయంతో సులువుగా కార్యాన్ని సాధించవచ్చు. నుదుటన బొట్టు పెట్టుకునేవారు, అద్దంలో కనుక చూసుకుంటే వంకర టింకర లేకుండా తిన్నగా పని జరుగుతుంది కదా!

 

..Nirjara