ఇంత జరుగుతున్నా
ఇంత జరుగుతున్నా
దొరసిన కాయముల్ముదిమి తోచినఁజూచి ప్రభుత్వముల్సిరుల్
మెఱపులుగాగజూచి మఱి మేదినిలోఁ దమతోడివారు ముం
దరుగుటచూచి చూచి తెగునాయువెఱుంగక మోహపాశము
ల్దరుఁగని వారికేమి గతి దాశరథీ! కరుణాపయోనిధీ!
మానవ దేహాలు ముసలితనంతో క్రుంగిపోవడం చూస్తూనే ఉంటాము. ప్రబుత్వాల సంపదలు మెరుపుతీగలల్లాగా అంతలోనే అంతర్థానం కావడం చూస్తుంటాము. అంతదాకా ఎందుకు! తమతో పాటుగా పుట్టినవారు, తమ కళ్ల ముందే చనిపోవడమూ గమనిస్తుంటాము. ఇంత జరిగిన తరువాత కూడా మోహపాశాలతో భౌతిక ప్రపంచం మీద వ్యామోహాన్ని పెంచుకునే ప్రజల గతి ఏమని చెప్పగలం!
..Nirjara