తులసి మొక్కకి నీళ్లు...ఏ పాత్రతో పోస్తే మంచిది!

 

తులసి మొక్కకి నీళ్లు...ఏ పాత్రతో పోస్తే మంచిది!

తులసి మొక్కకు నీరు అందించడానికి ఏ లోహపు పాత్రను ఉయోగించడం శుభప్రదం. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

మనదేశంలో హిందువులు తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అందరి ఇళ్లల్లోనూ తులసి మొక్కను ఉంచుని పూజిస్తుంటారు. మత విశ్వాసాల ప్రకారం, తులసి చాలా ప్రత్యేకమైంది.అంతేకాదు ఎంతో పవిత్రమైనది భావిస్తారు. పద్మపురాణం నుంచి గరుడ పురాణం వరకు తులసి మొక్కగొప్పతనాన్ని వివరించారు. శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి ఆరాధన తులసి ఆకులు లేకుండా అసంపూర్ణంగా చెబుతుంటారు. గాలిపుత్రుడైన హనుమంతుని నైవేద్యంతో తులసి ఆకులు ఉపయోగిస్తారు. అదే సమయంలో ఇంటి ఆవరణలోనూ తులసి మొక్కను నాటడం వల్ల కుటుంబంలో కలిగే కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో తులసి మొక్కకు నీరు అందించడానికి ఎలాంటి లోహపు పాత్రను ఉపయోగించడం శుభప్రదం. ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి పాత్ర:

 తులసి చాలా స్వచ్చమైంది. తులసిని సక్రమంగా పూజిస్తే కోరిన కోరికలు నెరువేరుతాయని నమ్ముతుంటారు. మీరు తులసి మొక్కకు నీళ్లు పోస్తే రాగిపాత్రను ఉపయోగించవచ్చు. ఒక వ్యక్తి జాతకంలో గ్రహాల స్థానం బలపడుతుంది. కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అందుకే మీరు తులసి మొక్కకు నీరు పోస్తే రాగిపాత్ర తో నీరు పోయడం చాలా పవిత్రమైందిగా భావిస్తారు. అంతేకాదు రాగి పాత్రలోని నీటిని తాగడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

ఇత్తడిపాత్ర:

ఇత్తడిపాత్రతో కూడా తులసి మొక్కకు నీళ్లు పోయడం శుభప్రదం. ఇది సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది. విష్ణువుతోపాటు లక్ష్మీదేవి ఆశీస్సులు పొందవచ్చు. రాగి, ఇత్తడి పాత్రలతో తులసి మొక్కకు నీళ్లు పోయవచ్చు. ఇది శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే జీవితంలో వచ్చే కష్టాల నుంచి ఉపశమనం పొందవచ్చు.

స్టీల్ పాత్ర:

రాగి, ఇత్తడి పాత్ర అందుబాటులో లేనట్లయితే స్టీల్ పాత్రలో కూడా తులసికి నీరందించవచ్చు. దీనితో మనసులో ఎప్పుడూ చెడు భావాలు ఉండవు. కుటుంబ సభ్యులత మంచి సంబంధాలు ఉంటాయి. ఒక వ్యక్తి ఎప్పుడూ ఎలాంటి సమస్యలను ఎదుర్కోడు.