Read more!

జీన్స్ ప్యాంట్ వేసుకున్న వారు ఇది ధరిస్తే అదిరిపోతారు!

 

జీన్స్ ప్యాంట్ వేసుకున్న వారు ఇది ధరిస్తే అదిరిపోతారు!

వర్షం, చలి రెండూ దాడి చేస్తుంటే మహిళలు ముడుచుకుపోతారు. మహిళల చర్మం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. ఆ కారణం వల్ల వారి చర్మం దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.  అందుకే చర్మానికి లోషన్ లు, మాశ్చరైజర్ లు, క్రీమ్ లు వంటివి ఎన్నో పూస్తారు. అవన్నీ పూస్తే చర్మం పాడవకుండా బానే ఉంటుంది.  కానీ బయటి వాతావరణ ప్రభావం మాత్రం తగ్గదు కదా. చల్లని గాలి శరీరాన్ని తాకుతూ ఉంటే ఒణుకు పుడుతుంది. ఆ ఒణుకు మనిషిని కుదురుగా ఉండనివ్వదు.

బయటకు వెళ్ళినప్పుడు అమ్మాయిలు ఈ చలి భరించలేక వెచ్చగా ఉండటానికి స్వేటర్లు  వేసుకోవాలని అనుకుంటారు. కానీ వారికి ఫాషన్ మిస్సయిపోతుంది, స్వెట్టర్స్ చూడటానికి అంత అట్రాక్షన్ గా ఉండవనే కారణంతో వాటిని పక్కన పెట్టి సాధారణ ఫాషన్ దుస్తులలో వణుకుతూ, పైకి మాత్రం ఎలాంటి ఎమోషన్స్ బయటపడనివ్వకుండా ఉంటారు. అయితే అమ్మాయిలు ఫాషన్ గా ఉంటూ వెచ్చగా, హాయిగా ఉండేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి.

పోలో స్వెట్టర్స్!!

చూడటానికి టీ షర్ట్ టైప్ లో పలుచగా ఉంటూ వెచ్చదనాన్ని ఇవ్వడం వీటి ప్రత్యేకత. బరువు కూడా ఎక్కువగా ఉండవు. మహిళలకు ప్రత్యేకంగా బోలెడు రకాల పోలో స్వెట్టర్స్ ఆన్లైన్ షాపింగ్ లలోనూ, బయటి షాపింగ్ మాల్స్ లోనూ అందుబాటులో ఉంటాయి. వీటిలో కొన్ని రకాల రంగులు, కొన్ని స్టైల్స్ కూడా ఉంటాయి. 

ప్రతి రోజూ విభిన్నంగా ఉంటూ సౌకర్యవంతంగా ఉండటానికి వీటిని ధరించడంలో కూడా ప్రత్యేకత చూపించచ్చు. 

జీన్స్ తో!!

జీన్స్ ప్యాంట్స్ వేసుకునే వారు ఈ పోలో స్వెట్టర్స్ ధరిస్తే అధిరిపోతారు. బ్రైట్ కలర్స్ పోలో స్వెట్టర్స్ జీన్స్ తో కలిపి వేసుకుంటే చాలా మోడ్రన్ లుక్ వస్తుంది. ఇది రెగులర్ గానూ, పార్టీస్ కూ, ఔటింగ్ వెళ్లినప్పుడూ ఇలా అన్ని రకాలుగా భలే మ్యాచ్ అవుతుంది.

డిఫరెంట్ లుక్స్!!

విభిన్నత ఎప్పుడూ విశిష్టమైనదే. ఈ పోలో స్వెట్టర్స్ ధరించేటప్పుడు అదే ప్రయోగం చేయచ్చు. కేవలం జీన్స్ తో షైన్ అవ్వకుండా ప్లాంజో, స్కర్ట్ లతో కూడా వీటిని ధరించవచ్చు. అయితే కాసింత జాగ్రత్తగా పోలో స్వేట్టర్లను రంగుల వారిగా ఓ నాలుగైదు కొనుగోలు చేయగలితే రెగులర్ డ్రెస్ వేర్ లాగా రోజుకో రంగులో డిఫరెంట్ బాటమ్ ఐటమ్ తో బిందాస్ గా షేక్ అవ్వచ్చు.

ఈ పోలో స్వెట్టర్స్ కూడా వెరీయేషన్స్ ఉంటాయి. వాటిలో నార్మల్ వెర్షన్, సీవ్లెస్ వెర్షన్, పొట్టిగా ఉండే క్నిట్ వెర్షన్, లో నెక్, ఫుల్ నెక్, బటన్స్ స్వెట్టర్స్, వితౌట్ బటన్స్, హాఫ్ హ్యాండ్ స్వెట్టర్స్ ఇలా బోలెడు ఉంటాయి. ఇవన్నీ కూడా వివిధ రంగులలో, వివిధ డిజైన్లలో లభ్యమవుతాయి. కాబట్టి చలిని కూడా రాక్ ఆన్ చెయ్యాలంటే పోలో స్వెట్టర్స్ ను తెచ్చేసుకోండి.

                                                            ◆నిశ్శబ్ద.