హింగ్లాజీ మాతా మందిర్ (పంచ పాండవ గుహలు)
హింగ్లాజీ మాతా మందిర్ (పంచ పాండవ గుహలు)
శ్రీ కృష్ణుడు పెరిగి ద్వారకలో వుండి చివరికి నిర్యాణం చెందిన ఆ ప్రదేశాలు ప్రభాస్ తీర్ధం, గుజరాత్ లోనే వున్నాయి . యా చుట్టు పక్కల ప్రతి ప్రదేశం పవిత్రమైనదే! అక్కడ వున్న ప్రదేశాలలో ముఖ్యమైన ప్రదేశం గా చెప్పబడే హింగ్లాజీ మాతా (పాండవుల గుహ) అనే ప్రదేశం. ఆ గుహ గురించి ....
సోమనాథ్ వెళ్ళినపుడు సిటీ టూర్ లో భాగంగా హింగ్లాజీ మాతా మందిర్ చూసాము. దీనినే పంచ పాండవుల గుహ అని కూడా అంటారు. పాండవులు అజ్ఞాతం లో వున్నపుడు ఇక్కడ కొంతకాలం వున్నారని అంటారు.
ఈ గుహని అనుకునే హింగ్లాజీ మాత గుడి వుంది. ఈ గుహలోకి వెళ్ళటానికి దారి చాలా చిన్నగా వుంటుంది . వెళ్ళిన వాళ్ళు వస్తే తప్ప ఇంకొకరు వెళ్ళటానికి లేదు. లోపల విగ్రహాలు చిన్నవిగా వున్నాయి. ఈ స్థలం గురించిన వివరాలు అంతగా లభ్యం కాలేదు. ఈ గుహలు చాలా చిన్నవి. ఈ గుహల దగ్గర లోనే సూర్య మందిర్, ఆది శంకరాచార్య మందిరం, ఒక చిన్న కొలను వున్నాయి. ఆ నీటి దగ్గరికి వెళ్ళాలంటే మెట్లు దిగి వెళ్ళాలి.
హింగ్లాజీ మాత గుహ లోపలికి పాకుతూ వెళ్ళినట్లే వెళ్ళాలి. .
పవిత్రమైన జ్యోతిర్లింగ మైన ఆ సోమనాదీసుని చూసిన అనంతరం భక్తి భావం కలగదు. ఇవన్నీ పురాణ స్థలాలు, పురాతన ప్రదేశాలు, సందర్సనీయ స్థలాలు అంతే ! ఒక టూరిస్ట్ ప్లేస్ గా అక్కడి స్థలాలు చూడాలి .
ఆ సోమనాధుని చూసి, చుట్టు పక్కల చూసే యాత్రా ప్రదేశాలు ఇవన్నీ. ...
(పురాణాల ప్రకారం హింగ్లాజి మాత ప్రధానం గా చెప్పుకునే శక్తి పీఠం పాకిస్తాన్ లో బెలూచిస్తాన్ లోని హింగోల్ నదీ తీరంలోని హింగ్లాజి ప్రాంతంలో వున్నదని అంటారు. సతీ దేవి శరీర భాగాలలో శిరో భాగం (బ్రహ్మ రంధ్రం) ఇక్కడ పడినదని కథనం.)
మన భారత దేశం లోనూ రెండు మూడు ఆలయాలు ఈ మాతకి వున్నాయి. మేము చూసిన గుజరాత్ లోని సోమనాథ్ లో 5 కి.మీ. దూరంలో ఈ గుహలు వున్నాయి.గుహలో ఏముందో, ఎలా వుంటుందో తెలుసుకునే వారికి తప్పకుండా ఈ ప్రదేశం నచ్చుతుంది. ఈ గుహలు, సూర్య మందిర్ కి వెళ్ళే దారి ఇరుకుగా వుంటుంది. అటు ఇటు దుకాణాలు యాత్రికులని ఆకర్షిస్తూ వుంటాయి . సూర్య మందిర్కి మెట్లు ఎక్కాలి, గుహలకి మెట్లు దిగాలి. నడక తప్పదు . మన వెహికిల్ దూరంగా వుంటుంది.
....Mani Kopalle