గణపతికి ఏనుగు తలనే ఎందుకు అతికించారు? (Ganapati -Reason of Elephant Face)
గణపతికి ఏనుగు తలనే ఎందుకు అతికించారు?
(Ganapati - Reason of Elephant Face)
గణపతికి ఏనుగు తలనే ఎందుకు అతికించారనే సందేహం కలగడంలో ఆశ్చర్యం లేదు. దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే -
ఇతర జంతువులతో పోల్చినప్పుడు ఏనుగు సాధుజీవి. గజరాజుకు కోపం తెప్పిస్తే తప్ప సర్వసాధారణంగా ఎవరి జోలికీ వెళ్ళదు. ఏనుగు తల పెద్దది కూడా. అంతకుమించి ఏనుగుతలలో కర్మేంద్రియం శక్తివంతంగా ఉంటుంది. మనిషిలో జ్ఞానేంద్రియాలు ఉంటాయి. ఇటు మనిషిని, అటు ఎనుగునూ జతకూర్చడం అంటే (మనిషి శరీరానికి గజరాజ ముఖాన్ని అతికించడం) అబేధ సాధకత్వం, సమన్వయకారకం అయింది.
విఘ్నేశ్వరుడు ఏకదంతునిగా కనిపిస్తాడు. ఇలా ఎందుకంటే ఏకదంతం అనేది అద్వైతానికి సంకేతం. మరో రకంగా చెప్పుకుంటే చదువుల తల్లి సరస్వతి లాగే వినాయకుడు విద్యాది దేవత. భగ్న దంతం గణపతికి లేఖినిగా మారింది అనుకోవచ్చు.
వినాయకుని ''శూర్పకర్ణ'' అంటారు. అంటే చేటల మాదిరిగా పెద్ద చెవులు ఉన్నవాడు అని అర్ధం. మనం ధాన్యాన్ని చేటతో చెరిగి శుభ్రం చేసుకుంటాం. చెరగడం వల్ల తాలూతప్పా లాంటివన్నీ పోయి మంచి ధాన్యం మిగులుతుంది. గణపతి మాయ, మర్మం, మోసం, కపటం లాంటివాటిని ప్రక్షాళన చేసి మంచిని, సత్యాన్ని ప్రబోదిస్తాదనేదానికి సూర్పకర్ణం వెనుక ఉన్న రహస్యం.