అందరూ ఏకమైతే ఏదైనా సులువే

 

అందరూ ఏకమైతే ఏదైనా సులువే 
 
 

 
దేశంలో చెట్లు తగ్గిపోతున్నగ్రామాలు, నగరాలు ఎన్నో ఉన్నాయి. అలా చెట్లు తగ్గిపోయిన ఆ స్థానాంలో ఆవులు, గేదెలు, ఎద్దులు తగ్గి,  పిడకలు కూడ తక్కువగానే లభిస్తున్నాయి. అలాంటి ఓ ప్రాంతంలో ఓ చిన్న బజారు ఉంది. దానికి దగ్గరలో కొన్ని చెట్లు ఉన్నాయి. బజారుకు దగ్గరలో రైతుల యిళ్ళు లేకపోవడంతో  పశువులు కూడ అక్కడక్కడ తక్కువగా కనిపిస్తున్నాయి.ఇక వంటచేసుకోవడానికి ఊళ్లో వాళ్ళు కట్టెలు, పిడకలు కొనుక్కోవలసిందే. అయితే ఆ ఊళ్లో రెండు మూడు రోజుల నుండి వర్షం ఆగకుండూ పడుతూనే వుంది. దానితో ఆ బజారుకు గ్రామాల నుండి  కట్టెలను, పిడలకలను అమ్మడానికి ఎవరూ రాలేదు. అలా అక్కడున్న యిళ్ళలో్ ఎవరూ వంటలు చేసుకోవడానికి కట్టెలు లేకుండా పోయాయి.
 
వంట చేసుకోవడానికి ఇబ్బంది తలెత్తడంతో ఆ గ్రామానికి చెందిన అన్నదమ్ములిద్దరు ఎండుకట్టెల కోసం బయలుదేరారు. వాళ్ళ తండ్రి గ్రామంలో లేడు. వారి తల్లి ఎండుకట్టెలు లేకపోతే రొట్టెలు చేయడం కుదరదు.
ఆ విషయం ఆలోచించిన కొడుకు లిద్దరూ తమ తండ్రి నాటిన మామిడి చెట్టు దగ్గరకు వచ్చారు. అక్కడ తుపానుకు విరిగిపడిన ఓ పెద్ద ఎండుకొమ్మ నేలమీద వుండడం వారు చూశారు.
అన్న అన్నాడు, ‘‘కర్ర అయితే దొరికింది. కాని మనం దీనిని ఎలా తీసుకుపోగలం?’’
దానికి తమ్ముడు ‘‘దీనిని వదిలేసి మనం వెళ్ళిపోతే ఎవరైనా దీనిని ఎత్తుకు పోతారు’’ అన్నాడు.
కానీ వారు చేయగలిగేది ఏముంది? 
అందులో అన్న వయస్సు పది సంవత్సరాలు, తమ్ముడి వయస్సు ఎనిమిదిన్నర సంవత్సరాలు. అంత పెద్ద కర్ర వారు ఎత్తలేరు కదా..  అంతలో చిన్నవాడు కొమ్మతో బాటు పడిన ఓ పెద్ద పురుగును చిన్నిచిన్ని అనేక చీమలు కలిసి లాక్కుని పోతూండడం చూశాడు. వాడు గట్టిగా, ‘అన్నయా ఇదేమిటి.’ అన్నాడు.
 
    అన్న :- ‘‘ఈ చీమలు పురుగును లాక్కుపోతున్నాయి’’.
     తమ్మడు:- ‘‘ఇంత చిన్నచీమలు యింత పెద్ద పురుగును ఎలా లాక్కుపోతున్నాయి’’.

అన్న ‘‘చూడు ఎన్ని చీమలున్నాయో? అన్నీ కలిసి పురుగును సునాయాసంగా లాక్కుపోతున్నాయి. అన్నిచిన్న చీమలు కలిస్తే బలవంతమైన పెద్ద పాముని కూడ యీడ్చుకు పోగలవు.’’ఇక ఆ చీమలు నెమ్మదినెమ్మదిగా పెద్ద పురుగును యీడుస్తున్నాయి. పురుగు లావుగా వుంది. అది మాటి మాటికీ జారి పోతూంది.  అప్పుడప్పుడు పది పదిహేను చీమలు దాని క్రిందపడి నలిగి పోతున్నాయి. కానీ, మిగిలిన చీమలు ఆ పురుగును కదిపి నలిగిపోతున్న చీమలను బయటపడేలా చేస్తున్నాయి. నల్లని, చిన్న చిన్న చీమలు ‘అలసట’ అన్నపేరును ఎరుగవు, అన్నదమ్ములిద్దరూ అలా చూస్తుండగానే అవి ఆ పురుగును దూరంగా నెమ్మదినెమ్మదిగా యీడ్చకు పోయాయి.తమ్ముడుకి అది ఎంతో ఆనందాన్ని కలిగించింది. చప్పట్లు కొట్టాడు. కుప్పిగంతులు వేశాడు. వెళ్ళి పడి ఉన్న ఎండుకొమ్మమీద కూర్చున్నాడు ‘అన్నయ్యా మనం చీమలకంటె తక్కు వారమా? నువ్వు వెళ్ళి మీ స్నేహితులను పిలుచుకురా. నేనిక్కడ కూర్చుంటాను. మనమందరం కలిసి ఈ కొమ్మను ఎత్తకు పోదాము’ అన్నాడు. పెద్దవాడు ఊళ్లోకి  వెళ్ళి తన మిత్రులను పిలుచుకు వచ్చాడు. చాలా మంది పిల్లలు కూడారు. వారందరూ ఆ పెద్ద కొమ్మను దొర్లిస్తూ ఈడ్చూకుపోసాగారు. మొత్తంమీద అందరూ కలిసి దానిని అన్నదమ్ముల యింటికి చేర్చారు.
 
    ఆ పిల్లల తల్లి తన బిడ్డలతో వచ్చిన పిల్లలందరికీ మిఠాయిపెట్టి ‘బాబులూ కలయికలో మహాబలం ఉంది. మీరందరూ కలసి పనిచేసి కఠినాతి కఠిన కార్యాలను సాధించగలుగుతారు. కలిసి మెలసి వుండడం వల్ల మీ మనస్సులు కూడ ఆనందంగా ఉంటాయి. మీ పనులు కూడ సునాయాసంగా జరుగుతాయి.’ అని హితవు పలికింది. పిల్లలు మిఠాయిలు తింటూ అమ్మ చెప్పిన మాటను ఆకలింపు చేసుకున్నారు.