గురుసేవ మహద్భాగ్యం

 

గురుసేవ మహద్భాగ్యం
 
 
 
 
మహా మహా గురువులకు సేవ చేసుకునే అవకాశం కోసం పిన్నలూ, పెద్దలూ ఆరాటపడుతుంటారు. అంతటి మహానుభావులకు మన ఉపచారాలు అవసరం లేదు. కానీ మనం గౌరవభావం, భక్తి భావంతో ఉపచారాలు చేస్తే సంతోషంగానే స్వీకరిస్తారు. గురుసేవా భాగ్యం కలిగినప్పుడు బద్ధకం, అలసత్వం, అవిశ్వాసం లాంటివి దరి చేరకూడదు. ఇతర కార్యాల పై మనస్సు విచలితం కాకుండా గురు చరణాలపై ధృడవిశ్వాసంతో సేవలందించాలి. 
 
 
 
సద్గురువు శిష్యులకు సరైన మార్గోపదేశం చేస్తారు. వారిని అపాయాల నుంచి తప్పిస్తారు. అపాయల జాడ కూడా వారికి తెలియకుండాని వారికి ఉపాయలు తెలియజేస్తారు. గురువులు మన అజ్ఞానాన్ని పోగొట్టి, జ్ఞాన మార్గాన్ని చూపిస్తారు.ఈ త్రిభువనాలలో గురువు కంటే గొప్ప దాత మరొకరు ఉండరు. కల్పతరువు కల్పిత వస్తువులనే మాత్రమే ఇవ్వగలదు. చింతామణి కోరుకున్న దానిని మాత్రమే ప్రసాదిస్తుంది. కానీ గురువులు మనసు ఊహించని నిర్వికల్ప స్థితిని మనకు అందించగలరు. ఆశించని ఆత్మస్థితి సిద్థింపచేయగల శక్తిసంపన్నులు గురువులు.గురువుల సేవ భక్తితో చేసిన వారు బ్రహ్మసాయిజ్యాన్ని పొందగలుగుతారు.