మనకి మనమే ...

 

మనకి మనమే ...

 

 

 

 

మనకి ఎవరో సహాయము చేయాలి, మనలను ఎవరో కాపాడాలి, మనలను ఎవరో మార్చాలి అని భావిస్తూ నడవటము వ్యర్ధజీవుల లక్షణము. సహాయము ఎక్కడనుంచో రాదు. అది మనలోనుండే ఉద్భవించాలి.
మనకుమనమే నిజమైన సహాయము చేసుకోగలము. మనకుమనము సహాయము చేసుకోలేనపుడు వేరెవరూ సహాయము చేయలేరు.
మనము మన మానశిక శక్తిని ఉపయోగించగలిగినపుడు అనుకున్నది సాధించగలుగుతాము. అందరూ మెచ్చుకునే నాయకునిగా ఎదుగుతాము. మనము నడిచే బాట ఆదర్శముగా మారుతుంది. మన ఉన్నతికిమన పనులే కారణం.
మన అభివృద్దికిమనo తీసుకున్న నిర్ణయాలే కారణం. మన నిర్ణయాల నాణ్యత మన మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది.
మన గమ్యానికి మనమే భాద్యులము.
ఈ విషయాన్ని గుర్తించి నిరంతరమూ మనల్ని మనం ఉత్తేజపరచుకుంటూ, ప్రేరణ పొందుతూ, ప్రోత్సహ పరచుకుంటూ మన ముందున్న అనేక సమస్యలను జయించ వచ్చును, గొప్ప విషయాలను సాదించ వచ్చును.