Types of Namaskaras

 

నమస్కారాలు – పద్ధతులు

Types of Namaskaras

 

మన శాస్త్రాలు పెద్దలకు, దేవుడికి ఎలా నమస్కరించాలనే విషయాలన్ని పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆ నియమనిబంధనలను ఎవరూ పట్టించుకోలేదు. ఆ నియమాల ప్రకారం పెద్దలకు నమస్కరించేటప్పుడు వంశపారంపర్య వివరాలను, పేరు గోత్రం వివరాలన్నీ చెబుతూ నమస్కరించాలి. స్త్రీలకు నమస్కరించేటప్పుడు ఈ వివరాలన్నీ చెప్పనక్కర్లేదన్నది శాస్త్రవచనం. ఎందుకంటే స్త్రీలకు ఆ విషయాలు భర్త ద్వారా అవగతమవుతాయన్నది శాస్త్రకారుల అభిప్రాయం.

అలాగే పెద్దలు, అగ్రజులు, గృహస్థులకు ఒకసారి నమస్కరిస్తే చాలని పెద్దలు చెబుతుంటారు. తమకంటే చిన్నవారి దగ్గర్నుంచి నమస్కారాలను అందుకున్న పెద్దలు, తప్పకుండా ఆశీర్వచనాలను ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఇలా నమస్కారాన్ని స్వీకరించిన పెద్దలు, పిల్లలకు ‘దీర్ఘాయుష్మాన్భవ’, చిరంజీవ భవ’ అని ఆశీర్వదిస్తుండేవారు. అదే సమయంలో ఆశీర్వచనాలను ఇవ్వని పెద్దలకు నమస్కరించవనవసరం లేదని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే ‘నమస్కారం’ వెనుకగల అసలు ఉద్దేశం ఆశీర్వచనములను అందుకోవడమే తప్ప ఎదుటి వ్యక్తిని మానవాతీత వ్యక్తిగా చూడడం కోసం కాదు.

సన్యాసులను, మఠాధిపతులను దర్చించుకునేటప్పుడు అక్కడి నియమాలను అనుసరించి, నమస్కరించాల్సి ఉంటుంది. అంతే తప్ప, వారిముందు తమ గోత్ర వివరాలను చెప్పనవసరం లేదు. అలాగే సన్యాసులకు, మఠాధిపతులకు నమస్కరించేటప్పుడు, గతంలో తెలిసో తెలియకో మనం చేసిన తప్పులను అప్పగించాల్సిన అవసరం లేదు. సన్యాసులను చూసినపుడు ‘నమో నారాయణాయ’ అని చెప్పాల్సి ఉంటుంది. ప్రతిగా సదరు సన్యాసి కూడా ‘నమో నారాయణాయ’ అని చెప్పడం జరుగుతుంది.

మన సంస్కృతిలో నమస్కారానికి ఇంత అంతరార్ధం ఉంది. మన భారతీయ సంస్కృతిలో నమస్కారానికి ఎంతో విశిష్టత ఉంది. అసలు నమస్కార ప్రక్రియ మనలోని వినయ భావాన్ని వ్యక్తీకరించడానికి ఏర్పడింది. సంస్కృతంలో ‘నమస్’ అంటే ‘వినయం, భక్తితో కూడిన ప్రణామం’ అని అర్థం. ‘తే’ అంటే ‘మీకు’ అని అర్థం. కాబట్టి ‘నమస్తే’ అంటే, ‘మీకు భక్తితో కూడిన ప్రణామం’ అని అర్థం. అందుకే పెద్దలను చూసినపుడు గౌరవ భావంతో నమస్కరిస్తుంటాం.

అలాగే మనం నిత్యజీవితంలో తెలిసో తెలియకో, కొన్ని తప్పులను చేస్తుంటాం. ఆ తప్పులను పోగొట్టుకునేందుకు భగవంతుని ముందు మోకరిల్లి నమస్కరిస్తాం. ఎవరైనా ఏదైనా తప్పు చేసినపుడు అతనితో ‘పాప పరిహారార్ధం దేవునిముందు ప్రణమిల్లమ’ని మనం చెబుతుంటాం. ప్రతి మతంలో ఇలా నమస్కార పద్ధతిలో తప్పులను సరిదిద్దుకోవడం కనిపిస్తుంటుంది. కొన్ని మతాలలో వంగి దణ్ణం పెట్టే సంప్రదాయం ఉంది.

ఈ సందర్భంగా కొంతమందికి అసలు నమస్కారాన్ని ఎలా చేయాలన్న సందేహం కలుగుతుంటుంది. ప్రతి మతంలో నమస్కారం పెట్టేందుకు కొన్ని నియమాలు ఉద్దేశించబడ్డాయి. అయితే కొందరు ‘సెల్యూట్’ పెట్టినట్లుగా నమస్కరిస్తుంటారు. మరికొంతమంది రెండు చెంపలను వాయించుకుంటూ నమస్కరిస్తుంటారు. ఇంకొందరు రెండు అరచేతులను జోడించి నమస్కరిస్తుంటారు. కొన్ని ప్రాంతాలలోని ప్రజలు ముందుగా చేతులతో భూమిని తాకి, తర్వాత తలను నేలకు ఆనించి నమస్కరిస్తుంటారు.

సాధారణంగా మన సంప్రదాయాల్లో సాష్టాంగ మనస్కారం, పంచాంగ నమస్కారాలను చూస్తుంటాం. పంచాంగ నమస్కారంలో మన శరీరంలోని ఐదు భాగాలు భూమిని తాకుతాయి. స-అష్టాంగ – అంటే శిరస్సు, మొండెము, రెండు భుజాలు, రెండు కాళ్ళు, రెండు చేతులను నేలకు ఆనించి నమస్కరించే పధ్ధతి. స్త్రీలకు మాత్రం పంచ – అంగ నమస్కారం ఉద్దేశించబడింది. స్త్రీలు రెండు భుజములు, మొండెము వదిలి మిగతా అయిదు అవయవములతో (శిరస్సు, రెండు కాళ్ళు, రెండు చేతులు) నేలను తాకుతూ నమస్కరించాలి.

స్త్రీలకు మాత్రమే ఎందుకు ఇలాంటి నియమం అని ప్రశ్నించుకున్నప్పుడు, దీనివెనుక హిందూ ధర్మం స్త్రీ మూర్తికిచ్చిన గౌరవమర్యాదలే. ఇందుకు సంతోషం కలుగుతుంది. మొత్తానికి స్త్రీలకు పంచాంగ నమస్కారం ఉద్దేశించబడింది. మాతృత్వానికి మన సంప్రదాయంలో అంతటి మర్యాద.

తైత్తరీయోపనిషత్ ‘పరమాత్మను నమస్కారముగా ప్రార్ధించు. కోరికలన్నీ నీకు నమస్కారం చేస్తాయి’ అని పేర్కొంటోంది. నిజం చెప్పాలంటే కేవలం ఒక్క నమస్కారం ద్వారా కోరికలను ఈడేర్చుకోవాలనుకోవడం కూడ అవివేకమే. ఎందుకంటే అసలు తనంతట తానే సర్వశుభాలను కలిగించే ప్రయత్నం నమస్కారం. అభిషేకానికి ఉపయోగించే రుద్రసూక్తంతో ‘నమక’ అనే వాకములున్నాయి. ఈ అనువాకములతో శివుడు అనేక పేర్లతో, అనేక సార్లు ‘నమో నమః’ అని ప్రార్ధించబడతాడు. శివుని పంచాక్షరి, నారాయణుని అష్టాక్షరి మంత్రాలు రెండూ’నమః’శబ్దంతో మొదలవుతాయి. అందుకే పరమేశ్వరుడిని నమస్కార ప్రియునిగా అభివర్ణిస్తుంటారు.

 

hindu devotional information, , hindu rituals, hindu culture and traditions, hindu bhakti samachar, hindu traditional information, Templest in rituals in India, Types of Namaskaras