Read more!

అమ్మానాన్నల రుణం ఎలా తీర్చుకోవాలి?

 

అమ్మానాన్నల రుణం ఎలా తీర్చుకోవాలి?

 

ప్రపంచంలో అత్యంత ఆత్మీయ సంబంధం మాత్రు, పితృ సంబంధం. బిడ్డకు జన్మనివ్వడంతో ముగిసిపోదు. నిజానికి అప్పుడే మొదలవుతుంది. ఎంతో శ్రమ పడాలి. ఎన్నో సేవలు చేయాలి. ఇంకెన్నో త్యాగాలు చేయాలి. పశుపక్ష్యాదులు కేవలం కాస్తంత తర్ఫీదు పొందుతాయి. నాలుగు రోజులు మాత్రమే ఆధారపడతాయి. కానీ, పిల్లలు అలా కాదు, తల్లిదండ్రుల మీద కలకాలం ఆధారపడతారు. ముఖ్యంగా తల్లి చేసే సేవను వెలకట్టలేం.

అమ్మానాన్నలు ఇలలో కనిపించే దైవాలు. తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిది. కానీ, కొంతయినా తీర్చుకునే ప్రయత్నం చేయాలి.

పిల్లలు స్వతంత్రంగా ఎదిగిన తర్వాత, తల్లిదండ్రులను చూసుకోవాలి. అమ్మానాన్నలు మనని ఎంత అల్లారుముద్దుగా పెంచారో, అచ్చం అంత ప్రేమగా, ఆత్మీయంగా చూసుకోవాలి. ఒకవేళ వయసు పైబడి, తమ పనులు తాము చేసుకోలేకపోతే, పిల్లలు తప్పకుండా ఆ పనులు కూడా చేయాలి. అది కూడా విసుగు, అసహనం లేకుండా ప్రేమగా చేయాలి. మరింత వ్రుద్దులై కాలం చేస్తే, తర్పణాలు వదలాలి. ఇలా అమ్మానాన్నల రుణం తీర్చుకోవాలి.