Read more!

తిరుమల విశేషాలు

 

తిరుమల విశేషాలు

 

 

 

 

మన నక్షత్రమండలమైన పాలపుంత విష్ణుచక్రాకారంలో వుంటుంది. ఈ చక్రాకారం యొక్క ఒక అంచులోనిదే సూర్యమండలం. మన సూయునివంటి కోట్లాది నక్షత్రాలతో కూడినదే పాలపుంత. ఇందులో మధ్యన ఉన్న మకరరాశిలోని శ్రవణా నక్షత్రం నుండి విష్ణువు భూలోకానికి దిగివచ్చినట్టు పురాణాలు చెపుతున్నాయి. అందుకే స్వామివారి జన్మనక్షత్రం శ్రవణంగా జరుపుకుంటున్నాము. వేయి సూర్యులకాంతిలో ప్రకాశించే దివ్య త్రిదశవిమానంలో సిద్ధ సాధ్య కిన్నెరా కింపురుష గరుడ గంధర్వ అప్సరోగణాలతో పరివేష్టించబడి స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా వచ్చినట్టు శ్రీవారి ఆవిర్భావఘట్టంలో వర్ణించబడివున్నది. ఆ దివ్యవిమానం యొక్క ప్రతిరూపమే నేటి ఆనందనిలయ విమానం. ఆ దివ్యవిమానం ఇప్పటికీ సామాన్య మానవుల దృష్టికి అదృశ్యంగా నారాయణగిరి సానువులలో నిక్షిప్తమై వున్నట్లు కూడా చెప్పబడింది.

 

 

 

 

శ్రీ వెంతకేశ్వర స్వామివారి దివ్యమంగళ సాలగ్రామ శిలా స్వరూపం సుమారు 9 1/2 అడుగుల ఎత్తు వుంటుంది. శ్రీవారికి శుక్రవారం ఉదయం జరిగే అభిషేకసేవలో దర్శించుకోవచ్చు. శ్రీనివాసుడనే నామానికి ప్రతీకగా శ్రీదేవి శ్రీవారి వక్షస్థలంలో కుడివైపు కొలువై వుంటుంది. శిల్పశాస్త్రంలోనూ, ఆగమశాస్త్రంలోనూ మహావిష్ణువు కుదివక్షంలో శ్రీవత్సము అనే మచ్చగా అమ్మావారు వుంటారు. ప్రలంబాయజ్ఞోపవీతం, శంఖుచక్రాలతో పాటు వక్షస్థలం మీద వుండే శ్రీవత్సం కూడా మహావిష్ణువును గుర్తించే శిల్పశాస్త్ర సూత్రాలు.నిరంతర దైవచింతనతో, స్వార్థరహిత పూజలతో, పవిత్ర గాయత్రీజపంతో, పరమ నిగూఢమైన ఆగమసూక్తులతో

 

 

 

 

తనను తాను నారాయణుడిగా ఆవాహన చెసుకుని శ్రీవారి అర్చవతారానికి ఆరాధన చేసే యోగ్యతా సంపాదించుకున్న అర్చకుడు మాత్రమే గర్భాలయప్రవేశానికి,శ్రీవారి దివ్యదేహాన్ని స్పర్శించగలడు, లౌకికమైన భావనకి కూడా శ్రీవారి బింబాన్ని మలినపరచి, దివ్యతేజస్సును తగ్గించి, దైవసాన్నిధ్యాన్ని భక్తులను అనుభవించలేకుండా చేస్తుంది. గర్భాలయంలోని పవిత్రమైన వాతావరణాన్ని కాపాడే ప్రక్రియ కూడా అర్చకుల బాధ్యత. శ్రీవారికి చతుర్భుజాలు ఉన్నాయి. శుక్రవారం అభిషేకంలో దర్శించుకోవచ్చు. తర్వాత చేయబడే విశేష అలక్నరణలో పట్టుపీతాంబరాలు, తిరునాభారణాలు, పుష్పాలంకారాలతో శ్రీవారి శంఖచక్రాలు ఉన్న ఊర్ద్వబాహువులు రెండూ పూర్తిగా కప్పబడిపోతాయి.

 

 

 

 

'మామేకం శరణం వ్రజ' అనే భావద్గీతా వాక్యం రత్నాలతో చెక్కబడి శ్రీవారి వైకుంఠ హస్తం మధ్య సమర్పించబడి వుంటుంది. తన పాదపద్మములయందు శరణు పొంది తరించమని భక్తులకు సూచించే ఒక మార్గం. శ్రీవారి నిజరూపదర్శనం చూడడానికి శుక్రవారం అభిషేక సమయంలో ఉండాలి. పుష్పమాలలు, తిరునాభారణాలు, పట్టుపీతాంబరం లేకుండా శ్రీవారి స్వయం వ్యక్తమైన దివ్యమంగ సాలిగ్రామ స్వరూపం దర్శించుకోవచ్చు. శ్రీవారి ప్రసాదాన్ని భక్తితో స్వీకరించే వారెవరైనా భక్తులే. భక్తి పూర్వహన్మ సుకృతఫలం.మతం ఈ జన్మవలన ఈ దేహానికి సంభవించింది. ఆత్మకు మతమనేది లేదు.