ఉపదేశం చేస్తే వచ్చేవి కావు

 

ఉపదేశం చేస్తే వచ్చేవి కావు

ప్రదానం ప్రచ్ఛన్నం గృహముపగతే సంభ్రమ విధిః
ప్రియం కృత్వా మౌనం సదసి కథనం చాప్యుపకృతేః ।
అనుత్సేకో లక్ష్మ్యాం నిరభిభవసారాః పరకథాః
సతాం కేనోద్దిష్టం విషమ మసిధారావ్రత మిదమ్‌ ॥

దానాన్ని రహస్యంగా చేయడం, ఇంటికి వచ్చిన యాచకుని పట్ల ఆదరంగా వ్యవహరించడం, తను ఇతరులకు చేసిన మేలుని చెప్పుకోకుండా ఉండటం, ఇతరులు తనకు చేసిన మేలుని మాత్రం పదిమందిలోనూ ప్రస్తావించడం, సంపదలు వచ్చినప్పుడు కూడా వినయంతో ఉండటం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకపోవడం... ఇవన్నీ కూడా సజ్జనులకు ఉండే సహజమైన లక్షణములే కానీ, ఎవరో ఉపదేశం చేస్తే వచ్చేవి కావు!

 

-నిర్జర