తన బలమే తనకు చేటు
తన బలమే తనకు చేటు
ఘనబలసత్త్వ మచ్చుపడ గల్గినవానికి హాని లేనిచో
దనదగుసత్త్వమే చెఱుచు దన్ను నదెట్లన? నీరు మిక్కిలిన్
గను వసియించినన్ జెఱువు కట్టకు సత్త్వము చాలకున్నచో
గనుమలు పెట్టి నట్టనడి గండి తెగంబడకున్నె? భాస్కరా!
తను మహాబలవంతుడిననీ, తనని ఎదిరించే ధీరులు మరెవ్వరూ లేరనీ విర్రవీగనక్కర్లేదు. ఎందుకంటే ఒకోసారి మన బలమే మనకు చెరుపు చేస్తుంది. అది ఎలాగంటే... చెరువుగట్టుకి గండి పడేందుకు, ఆ చెరువులో పొంగిపొరలుతున్న నీరే కదా కారణం!
..Nirjara