అప్పుడు కుదురుతుందో లేదో అని...
అప్పుడు కుదురుతుందో లేదో అని...
ముప్పున గాలకింకరులు ముంగిటవచ్చిన వేళ, రోగముల్
గొప్పరమైనచో గఫము కుత్తుక నిండినవేళ, బాంధవుల్
గప్పినవేళ, మీస్మరణ గల్గునొ గల్గదొ నాటి కిప్పుడే
తప్పకచేతు మీభజన దాశరథీ కరుణాపయోనిధీ! (దాశరథీ శతకము)
జీవితంలో ఆఖరిక్షణాన నా ముంగిట యమభటులు నిలిచే వేళ, శరీరంలోని రోగంతో నా గొంతుక కఫంతో నిండిపోయే వేళ, నన్ను సాగనంపడానికి వచ్చిన బంధువులు నన్ను చుట్టుముట్టిన వేళ... నిన్ను స్మరించడం కుదురుతుందో లేదో! అందుకని రామా... ఇప్పుడే నిన్ను స్మరించుకుంటున్నాను.
-నిర్జర