చాడీలు చెప్పేవారు

 

 

చాడీలు చెప్పేవారు

 

 

మృగ మీన సజ్జనానాం తృణ జల సంతోష విహిత వృత్తీనామ్‌ ।

లుబ్ధక ధీవర పిశునా నిష్కారణ మేవ వైరిణో జగతి ॥

ఇతరుల మీద ఆధారపడకుండా లేళ్లు, తమ మానాన పచ్చిగడ్డి తింటూ గడిపేస్తాయి. కానీ వాటిని అకారణంగా వేటగాడు పొట్టన పెట్టుకుంటాడు. పాపం నీటిలో బతికేస్తూ ఉండే చేపలనేమో జాలర్లు పొట్టన పెట్టుకుంటారు. ఉన్నదానితో తృప్తి పడుతూ సంతోషంగా గడిపే సజ్జనులకేమో చాడీలు చెప్పేవారు, మనసుని చెడగొడుతుంటారు. వీరంతా కూడా అకారణమై శత్రువులవంటివారంటారు శతకకారుడు.