మూర్ఖుడు - పాము

 

మూర్ఖుడు - పాము!

 

ఉపదేశో హి మూర్ఖాణాం ప్రకోపాయ న శాంతయే। 

పయఃపానం భుజంగానాం కేవలం విషవర్ధనమ్‌॥


మూర్ఖులకు ఓ నాలుగు మంచిమాటలు చెప్పాలనుకుంటే అసలుకే మోసం వస్తుంది. మనం చెప్పే మాటలు విని ‘నువ్వు నాకు చెప్పేంతటివాడివా!’ అంటూ చెలరేగిపోతారు. పాముకి కమ్మటి పాలు పోస్తే, దానికి ఉండే విషం మరింతగా పెరుగుతుంది కదా!