ఆ తప్పుని క్షమించాల్సిందే

ఆ తప్పుని క్షమించాల్సిందే!
అబుద్ధిమాశ్రితానాం తు క్షంతవ్యమపరాధినా।
న హి సర్వత్ర పాండిత్యం సులభం పురుషేణ వై॥
అందరికీ అన్నీ తెలియాలని లేదు. ఆ తెలియనితనంతో కొన్ని తప్పులు చేసే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి తెలియక చేసిన తప్పుని తప్పక మన్నించాల్సిందే!