Read more!

సేవకునిగా ఉండటం మహాకష్టం

 

 

 

సేవకునిగా ఉండటం మహాకష్టం

 

 

మౌనాన్మూకః ప్రవచన పటుర్వాచకో జల్పకో వా

ధృష్టః పార్శ్వే భవతి చ వసన్‌ దూరతోఽప్యప్రగల్భః ।

క్షాంత్యా భీరుర్యది న సహతే ప్రాయశో నాభిజాతః

సేవాధర్మః పరమ గహనో యోగినామప్యగమ్యః ॥

 

ప్రభువుకి సేవ చేయడం కత్తి మీద సాముతో సమానం. వారు మౌనంగా ఉంటే మూగవాడనీ, ఎక్కువగా మాట్లాడితే అసందర్భ ప్రేలాపిగానూ భావిస్తారు; నిత్యం రాజు వెన్నంటే ఉంటే భయభక్తులు లేనివాడుగానూ, దూరంగా ఉంటే పిరికివాడుగానూ తలుస్తారు; సేవలందించే సమయంలో మరీ సహనంగా ఉంటే భయస్తుడనీ, తనకి కలిగే ఇబ్బందులను చెప్పుకొంటూ ఉంటే చేతగానివాడనీ అంచనా వేస్తారు. అందుకనే సేవాధర్మాన్ని నిర్వర్తించడంలో మెలకువలు మహామహా యోగులకు సైతం తెలియవు.

..Nirjara