కూర రుచి గరిటెకు తెలియదుగా!
కూర రుచి గరిటెకు తెలియదుగా!
ఎడ్డె మనుష్యుఁడే మెఱుఁగు నిన్నె దినంబులు గూడి యుండినన్
దొడ్డ గుణాఢ్యునందుఁ గల తోరపు వర్తనలెల్ల బ్రజ్ఞఁ బే
ర్వడ్డ వివేకి రీతి; రుచిపాకము నాలుకగా కెఱుంగునే?
తెడ్డది కూరలోఁ గలయఁ ద్రిమ్మరుచుండిననైన భాస్కరా!
కూరని కలియతిప్పేదీ, వడ్డించేదీ గరిటే. కానీ ఆ గరిటెకి కూర రుచి తెలియదు కదా! అలాగే మూఢుడు ఎన్ని రోజులు గుణవంతునితో కలిసి తిరిగినా... అతని విలువను తెలుసుకోలేడు.
....Nirjara