డబ్బే ముఖ్యం
డబ్బే ముఖ్యం
జాతిర్యాతు రసాతలం గుణ గణైస్తత్రాప్యధో గచ్ఛతాత్
శీలం శైల తటాత్పతత్వభిజనః సందహ్యతాం వహ్నినా ।
శౌర్యే వైరిణి వజ్రమాశు నిపతత్వర్థో-స్తు నః కేవలం
యేనైకేన వినా గుణస్తృణ లవ ప్రాయాః సమస్తా ఇమే ॥
జాతి రసాతలంలోకి (పాతాళం) జారిపోవుగాక, గుణగణాలు నాశనమైపోవుగాక, శీలం అడుగంటిపోవుగాక, శౌర్యము నాశనమైపోవుగాక... ధనము మీద మక్కువ ఉన్నవాడికి ఇదంతా ఏమీ పట్టదు. ఎందుకంటే డబ్బు ముందర అతనికి మిగతా విషయాలన్నీ గడ్డిపోచలుగా కనిపిస్తాయి.
..Nirjara