రాముడికీ తప్పలేదు

 

 

 

రాముడికీ తప్పలేదు

 

 

ఈజగమందుఁదా మనుజు డెంత మపోహాత్మకుడైన దైవమా

తేజము తప్పఁజూచునెడఁద్రిమ్మరికోల్పడుఁనెట్లన న్మహా

రాజకుమారుఁడైన రఘురాముఁడు గాల్నడ గాయలాకులున్

భోజనమై తగ న్వనికిఁబోయి, చరింపఁడె మున్ను భాస్కరా!

 

మనిషి ఎంత గొప్పవాడైనా కూడా పరిస్థితులు అనుకూలించకపోతే... దేశదిమ్మరిలాగా తిరగక తప్పదు. రాముడంతటి వాడే మనిషి జన్మ ఎత్తిన కారణంగా కాలినడకన, ఆకులూకాయలూ తింటూ అడవిలో తిరగక తప్పలేదు కదా!

 

..Nirjara