Read more!

ఇచ్చిపుచ్చుకోవాలి

 

 

 

ఇచ్చిపుచ్చుకోవాలి

 

 

అక్కఱపాటు వచ్చు సమయంబునఁజుట్టములొక్కరొక్కరి

న్మక్కువనుద్దరించుటలు మైత్రికిఁజూడగ యుక్తమేసుమీ

యొక్కట నీటిలో మెరక నోడల బండ్లను బండ్లనోడలన్

దక్కక వచ్చుచుండుట నిదానముగాదె తలంప భాస్కరా!

 

నీటిలో పడవలు, బండ్లని తీసుకువెళ్తాయి, అవే పడవలను నేల మీద బండ్లు మోసుకువెళ్లాల్సిందే! మనుషులు కూడా అలాగే పరిస్థితిని బట్టి ఒకొరికొకరు సాయంగా నిలవాలి. అవసరమున్న చోట బంధువులు ఒకరినొకరు ఆదుకునేందుకు సిద్ధంగా ఉండాలి.

 

...Nirjara