Read more!

కుక్కలా బతకవద్దు

 

 

కుక్కలా బతకవద్దు

 

 

లాంగూల చాలనమధశ్చరణావఫూతం

భూమౌ నిపత్య వదనోదర దర్శనం చ ।

శ్వా పిండదస్య కురుతే గజ పుంగవస్తు

ధీరం విలోకయతి చాటు శతైశ్చ భుంక్తే ॥

పిడికెడు మెతుకుల కోసం కుక్క తన యజమాని ముందు ఎన్నో విన్యాసాలు చేస్తుంది. తోకని ఊపుతూ, నేల మీద పొర్లుతూ అతడి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఏనుగు అలా కాదు. దానిని మచ్చిక చేసుకునేందుకు మావటివాడే, ఏనుగును బుజ్జగించాల్సి ఉంటుంది. లాలనతో మెలగాల్సి ఉంటుంది. ధీరుల తీరు కూడా ఏనుగులాగే ఉంటుంది.