వీరుల పద్ధతి
వీరుల పద్ధతి
క్షుత్క్షామో-పి జరాకృశో-పి శిథిలప్రాయో-పి కష్టాం దశామ్
ఆపన్నో-పి విపన్న దీధితిరపి ప్రాణేషు నశ్యత్స్వపి ।
మత్తేభేంద్ర విభిన్న కుంభ పిశిత గ్రాసైక బద్ధ స్పృహః
కిం జీర్ణం తృణమత్తి మాన మహతామగ్రేసరః కేసరీ ॥
సింహం ఆకలితో అలమటిస్తున్నా, శరీరం కృశించిపోయినా, కష్టకాలం దాపురించినా... ఏనుగు కుంభస్థలం మీదకి లంఘించి తన క్షుద్బాధను తీర్చుకోవాలనుకుంటుందే కానీ ఎండుగడ్డిని తినదు కదా! వీరుల పద్ధతి కూడా ఇలాగే ఉంటుంది.
..Nirjara