అధములను ఆశ్రయిస్తే
అధములను ఆశ్రయిస్తే
సంతప్తాయసి సంస్థితస్య పయసో నామాపి న శ్రూయతే
ముక్తాకారతయా తదేవ నలినీపత్రస్థితం దృశ్యతే ।
అంతస్సాగర శుక్తిమధ్యపతితం తన్మౌక్తికం జాయతే
ప్రాయే ణాధమమధ్యమోత్తమ జుషా మేవంవిధా వృత్తయః ॥
కాలిన ఇనుము మీద పడ్డ నీటిబొట్టు కనుమరుగైపోతుంది. అదే తామరాకు మీద పడితే ముత్యంలా ప్రకాశిస్తుంది. ఇక ముత్యపుచిప్పలో పడితే ఏకంగా ముత్యంగానే మారుతుంది. అధములు, మధ్యములు, ఉత్తములని ఆశ్రయించినవారి పరిస్థితీ ఇంతే!
..Nirjara