కులముని అనుసరించి గుణములు రావు

 

 

 

కులముని అనుసరించి గుణములు రావు

 

 

పాలకడలిలోన ప్రభవించు మాత్రాన

హాలహలము మధురమగుట గలదె

కులము ననుసరించి గుణములు రావురా

లలితసుగుణజాల! తెలుగుబాల!!

క్షీరసాగరమధనంలో దేవదానవులు కలిసి చిలికితే ముందుగా వచ్చినది హాలాహలమే! పాలసముద్రంలో ప్రభవించినంతమాత్రాన అది తియ్యగా లేదు కదా! దాని బారి నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు సాక్షాత్తూ ఆ శివుడే పూనుకోవలసి వచ్చింది. అలాగే ఉన్నతము అని చెప్పుకునే కులంలో పుట్టినవాడు గుణవంతుడై ఉండాలనీ లేదు.

 

..Nirjara