కార్యసాధకుని లక్షణాలు
కార్యసాధకుని లక్షణాలు
ఒకచో నేలను బవ్వళించు, నొకచో నొప్పారుఁ బూసెజ్జపై,
నొకచోశాకము లారగించు, నొకచో నుత్కృష్ట శాల్యోదనం,
బొక్కచో బొంత ధరించు, నొక్కొక తఱిన్ యోగ్యాంబర శ్రేణి, లె
క్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్
కార్యసాధకుని దృష్టి ఎంతసేపూ లక్ష్యం మీదే ఉంటుంది కానీ.. తన చుట్టూ ఎలాంటి వసతులు ఉన్నాయా అని ఆలోచించుకోడు. అతను ఒకసారి పూలపాన్పు మీద పవళించినా అవసరం అయితే కటిక నేల మీద కూడా నిదురిస్తాడు. ఒక సందర్భంలో పంచభక్ష్య పరమాన్నాలు ఆరగించినా అవసరం అయితే ఆకుకూరలతో సరిపెట్టుకుంటాడు. పట్టువస్త్రాలను ధరిస్తూ ఉన్నా, బొంతను కప్పుకుని తిరిగేందుకు కూడా సిద్ధపడతాడు.
..Nirjara