తిండికి లేని కులం ఒంటికి ఎందుకు!
తిండికి లేని కులం ఒంటికి ఎందుకు!
అన్నమయములైన వన్ని జీవమ్ములు
కూడులేక జీవకోటి లేదు
కూడు తినెడికాడ కులభేద మేలకో
కాళికాంబ హంస కాళికాంబ
ఈ ప్రపంచంలో ప్రతి జీవీ మనుగడ సాగించాల్సిందే ఆహారాన్ని జీర్ణం చేసుకోవాల్సిందే. ఈ విషయంలో ఎలాంటి బేధమూ లేదు. ధనవంతుడు తిన్నా, బిచ్చగాడు తిన్నా అదే బియ్యపు గింజ. ఉడుత తిన్నా, చిలుక తిన్నా అదే జామకాయ. ఆహారంలో మార్పులు ఉండవచ్చు. దానిని తినే విధానంలో మార్పులు ఉండవచ్చు. కానీ ఏదో ఒక ఆహారాన్ని అరాయించుకోవడం మాత్రం తప్పదు కదా! మరి అలాంటి ఆహారాన్ని తినేచోట కులబేధాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు బ్రహ్మంగారు.
..Nirjara