ఎన్ని వస్తువులు ఉన్నా

 

 

 

ఎన్ని వస్తువులు ఉన్నా

 

 

దక్షుడు లేని యింటికి బదార్థము వేఱొక చోటనుండి వే

లక్షలు వచ్చుచుండిన బలాయనమై చను, గల్ల గాదు ప్ర

త్యక్షము; వాగులున్‌ వఱదలన్నియు వచ్చిన నీరు నిల్చునే

అక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా!

సమర్థుడైన యజమాని లేని ఇంటికి లక్షల కొద్దీ వస్తువులు వచ్చిపడినా, అవి నిరుపయోగంగా మారిపోక తప్పుదు. గండిపడిన తటాకంలోకి ఎన్ని వాగులు, వరదలు వచ్చి చేరినా నీరు నిలవదు కదా. 16వ శతాబ్దంలో వెంకయ్య కవి రాసిన భాస్కర శతకంలోనిది ఈ పద్యం. వస్తు వినిమయం పెరిగిపోయి, దేనిని ఎందుకు ఖరీదు చేస్తున్నామో తెలియని అయోమయంలో ఉన్న నేటి తరానికి సైతం ఈ పద్యం ఒక హెచ్చరికగా నిలుస్తోంది.

 

..Nirjara