పరిస్థితిని బట్టి

 

 

 

పరిస్థితిని బట్టి

 

 

పరిక్షీణః కశ్చిత్‌ స్పృహయతి యవానాం ప్రసృతయే

స పశ్చాత్సంపూర్ణః కలయతి ధరిత్రీం తృణ సమామ్‌ ।

అతశ్చానేకాంతా గురులఘుతయార్థేషు ధనినామ్‌

అవస్థా వస్తూని ప్రథయతి చ సంకోచయతి చ ॥

తినడానికి ఏమీ లేని రోజున... ఆకలితో కడుపు మాడుతున్నవాడికి, గుప్పెడు గింజలు కూడా మహద్భాగ్యంగా తోస్తాయి. కానీ సంపదలతో తులతూగినప్పుడు ఈ భూమి కూడా అతనికి గడ్డిపరకలాగానే కనిపిస్తుంది. ఒక వస్తువుకి మనం ఇచ్చే విలువ పరిస్థితిని బట్టి మారిపోతూ ఉంటుంది. దీనిని అతీతమైన సమత్వ దృష్టిని సాధించాలని చెప్పడం కవి ఉద్దేశం కావచ్చు.

 

 

..Nirjara