తుమ్మెద - కప్ప
తుమ్మెద - కప్ప
మధుకరంబు వచ్చి మకరందమును ద్రావు
సరసిజంబు క్రింద తిరుగు కప్ప
కాంచలేరు జడులు కావ్య సౌందర్యంబు
లలితసుగుణజాల! తెలుగుబాల!!
సౌందర్యాన్ని ఆరాధించే మనసు అందరికీ ఉండదు. సాహిత్యాన్ని అభిమానించే హృదయం అందరికీ ఉండదు. పూలలోని మకరందాన్ని గ్రోలేందుకు వచ్చే తుమ్మెదని, నేల మీదే తిరిగుతున్న కప్ప చూడలేదు కదా! అలాగే మోటు మనుషులు కావ్య సౌందర్యాన్ని గమనించలేరు అంటున్నారు కవిగారు.
..Nirjara