Gods East and West side
తూర్పు, పశ్చిమ దిక్కుల్లో ఉండాల్సిన దేవుడి పటాలు
Gods East and West side
ఇళ్ళలో దేవుడి పటాలు గోడలకు తగిలించడం మామూలే. అయితే దేవుడి పటాలను మన ఇష్టం వచ్చిన వైపు అమర్చకూడదు. వాస్తు ప్రకారం తూర్పు, పశ్చిమ దిక్కుల్లో ఏ దేవుడి పటాలను తగిలిస్తే మంచిదో తెలుసుకుందాం.
తూర్పున ఉండాల్సిన దేవతా పటాలు, ప్రయోజనాలు
తూర్పు గోడకు వేంకటేశ్వర స్వామి, లక్ష్మీ సహిత విష్ణుమూర్తి, సత్యనారాయణస్వామి, సీతారాముల పటాలను అమర్చవచ్చును. అంటే ఈ దేవతల పటాలు పశ్చిమానికి ముఖంచేసి ఉంటాయి. ఈ దేవతా చిత్రాలను తూర్పు గోడకు మధ్యభాగంలో ఉంచాలి.
తూర్పు గోడకు ఈ దేవతా చిత్రాలను తగిలించినందువల్ల పనులు సక్రమంగా పూర్తవుతాయి. సంతానం కలుగుతుంది. పిల్లల పెళ్ళిళ్ళు సమయానికి జరుగుతాయి. వ్యాపారంలో విజయం సాధిస్తారు. అనారోగ్యాలు తలెత్తవు.
పశ్చిమాన ఉండాల్సిన దేవతా పటాలు, ప్రయోజనాలు
పశ్చిమ గోడకు లక్ష్మీ సహిత నరసింహస్వామి చిత్రపటాన్ని అమర్చాలి. తూర్పు ముఖం చేసి ఉన్న లక్ష్మీ నరసింహ స్వామికి పశ్చిమాభిముఖంగా నమస్కరించుకుంటాం.
పశ్చిమ గోడకు ఈ స్వామి చిత్రాన్ని ఏర్పాటు చేయడంవల్ల కుజ దోషం తొలగుతుంది. ఎదురుచూస్తున్న శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబసభ్యులమధ్య సామరస్యం నెలకొంటుంది. శనిదోషం నివారించబడుతుంది.
gods on walls, indian vastu and gods, gods on east walls, gods on west side, house and puja room