గంగా స్తుతి శ్లోకము !

 

గంగా స్తుతి శ్లోకము !

దేవి సురేశ్వరి భగవతి గంగే ! త్రిభువనతారిణి తరళ తరంగే
శంకరమౌళి విహారిణి విమలే ! మమ మత్తిరాస్తాం తవ పదకమలే

ఓ గంగాదేవీ ! నీవు దేవగణానికి ఈశ్వరివి. ఓ భగవతీ ! నీ తరళ తరంగాలతో ముల్లోకాలను తరింపజేసేదానివి. విమలజలంతో శంకరుని శిరస్సున విహరించే నీ చరణకమలములపై నా మనస్సు ఎల్లప్పుడూ నిలిచివుండుగాక.