Read more!

నవరాత్రుల్లో అమ్మను ఇలా పూజిస్తే అదృష్టం మీ వెంటే..!

 

నవరాత్రుల్లో అమ్మను ఇలా పూజిస్తే అదృష్టం మీ వెంటే..!

 

దుర్గ... ఈ రెండక్షరాలనూ ఒక్కసారి పలికిన మాత్రం చేతనే... పాపాలన్నీ పటాపంచలు చేసే మహాతల్లి దుర్గమ్మ. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకురాలైన ఆ ఆదిపరాశక్తిని మనం పూజించుకునే శుభదినాలు శరన్నవరాత్రులు. నిజానికి అమ్మ రోజులు కానివి ఏవి? అన్నీ అమ్మ రోజులే. కానీ... మన కోసం.. మన అభ్యున్నతి కోసం.. ఈ నవరాత్రుల్లో తనను పూజించే మహద్భాగ్యాన్ని ప్రసాదించింది ఆ తల్లి. బాలాత్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, లలితా త్రిపురసుందరి, శ్రీ మహాలక్ష్మీ, సరస్వతి, దుర్గ, మహిషాసుర మర్దని, శ్రీ రాజరాజేశ్వరి ఇలా వివిధ రూపాల్లో మనకు దర్శనమిచ్చి.. ఈ నవరాత్రల్లో మనల్ని తరింపజేస్తుంది అమ్మ. అందుకే... ఈ దసరా నవరాత్రుల్లో అమ్మను ఎలా పూజించాలి? ఎలా పూజిస్తే అమ్మ కృపాకటాక్షాలు మనకు లభిస్తాయ్ అనేది తెలియజేయాలని సంకల్పించింది.. తెలుగు వన్.