దానధర్మాల వల్ల పుణ్యం వస్తుందా
దానధర్మాల వల్ల పుణ్యం వస్తుందా...?
ప్రపంచ జీవరాసుల్లో దానధర్మాలు చేసే అవకాశాన్ని కేవలం మనిషికే ఇచ్చాడు దేవుడు. అయితే... ఎవరికి దానం చేయాలి? ఎవరికి చేయకూడదు. అనే విషయానికొస్తే... అధర్మఫలం వల్ల వచ్చే పాపాన్ని దానం చేసి పోగొట్టుకుందాం అనుకుంటే... ఆ దానం వల్ల మరింత పాపం సంభవిస్తుంది తప్ప పుణ్య ప్రాప్తి కలుగదు. దానం అనేది పుణ్య ఫలంతోనే చేయాలి. అంతేకాదు... కడుపు నిండిన వాడికి చేసే దానం వృధా. బ్రాహ్మడైనా సరే.. ఆకలి గొన్నవాడికీ, అవసరం ఉన్నవాడికి మాత్రమే దానం చేయాలి. అప్పుడే తగు ఫలితం లభిస్తుంది. అన్ని దానాల్లో గొప్పది అన్నదానం. ఎందుకంటే.. ‘ఇక చాలు’ అనే తృప్తిగా అనగలిగేది అన్నం తిన్నాకే. డబ్బు ఇచ్చినా, బంగారం ఇచ్చినా, జ్ఙానం ఇచ్చినా.. ‘ఇక చాలు’ అనే పదం దానం తీసుకునే వ్యక్తి నుంచిరాదు. ధన, కనక, వస్తు, వాహన దానాలు అందుకునే వారికి తృప్తి కలగదు. కేవలం అన్నదానం అందుకునే వారికే తృప్తి కలుగుతుంది. అందుకే.. అన్నదానం గొప్పదానం. ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే... ఇక్కడున్న లింక్ క్లిక్ అనిపించండి.