రాముని సేవిస్తే
రాముని సేవిస్తే
నీ సతి పెక్కుగల్ములిడ నేర్పరి లోక మకల్మషంబుగా
నీ సుత సేయు పావనము నిర్మితి కార్యధురీణదక్షుఁడై
నీ సుతుఁడిచ్చు నాయువులు నిన్ను భజించినఁ గల్గకుండునే
దాసుల కీప్సితార్థములు దాశరథీ! కరుణాపయోనిధీ!ఓ రామా! నీ అర్ధాంగి అయిన లక్ష్మీదేవి సమస్త సంపదలనూ ప్రసాదించే నేర్పరి. నీ కూతురు గంగాదేవి లోకంలోని కల్మషాలను కడిగివేయగల సమర్థురాలు. నీ కుమారుడైన బ్రహ్మదేవుడు (బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి నాభి నుంచి ఉద్భవించినవాడే కదా) సకలజనులకు ఆయుష్షుని ప్రసాదించేవాడు. వీరంతా నీ చుట్టూ ఉండగా నిన్ను సేవించిన భక్తుల సమస్త కోరికలు ఈడేరకుండా ఉంటాయా.