రాక్షసులకన్నా హీనులు

 

 

రాక్షసులకన్నా హీనులు

 

 

ఏతే సత్పురుషాః పరార్థ ఘటకాః స్వార్థాన్‌ పరిత్యజ్య యే

సామాన్యాస్తు పరార్థముద్యమ భృతః స్వార్థావిరోధేన యే ।

తే-మీ మానుష రాక్షసాః పరహితం స్వార్థాయ నిఘ్నంతి యే

యే తు ఘ్నంతి నిరర్థకం పరహితం తే కే న జానీమహే ॥తన స్వార్థాన్ని సైతం వదులుకుని ఇతరుల ప్రయోజనాల కోసం పాటుపడేవారు ఉత్తములు. తన ప్రయోజనాలకు భంగం కలగకుండానే, ఇతరుల మేలు గురించి కూడా ఆలోచించేవారు మధ్యములు. కేవలం తన లాభం గురించే ఆలొచిస్తూ, ఆ క్రమంలో ఇతరులకి నష్టం కలిగినా కూడా ఫర్వాలేదు అనుకునేవారు మనుషుల రూపంలో ఉన్న రాక్షసులు. ఇక ఏ కారణమూ లేకుండానే ఇతరులకి నష్టం కలిగించేవారు ఆ రాక్షసులకన్నా హీనులు.