నాయకుడు సమర్థుడైతే

 

 

నాయకుడు సమర్థుడైతే

 

 

అవని విభుండు నేరుపరియై చరియించిన గొల్పువార లె

ట్లవగుణలైన నేమి పనులన్నియుఁజేకుఱు వారిచేతనే

ప్రవిమల నీతిశాలియగు రాముని కార్యము మర్కటంబులే

దవిలి యొనర్పవే? జలధి దాటి సూరారులద్రుంచి భాస్కరా!రాజు సమర్థుడు అయితే అల్పులైనవారితో కూడా అఖండమైన కార్యములు సాధించగలడు. అది ఎలాగంటే... రాముల వారు సీతమ్మను, రావణుని చెర నుంచి విడిపించేందుకు వానరాలను నియమించారు కదా! ఆ వానరాలు సముద్రాన్ని సైతం దాటుకుని లంకను చేరుకుని రాములవారి కార్యాన్ని సాధించగలిగాయి.