ఆ స్నేహం ఎలాంటిదంటే...

 

ఆ స్నేహం ఎలాంటిదంటే...

మెదడు పాడుచేయు, మేనెల్ల చెడగొట్టు,
కీర్తి నపహరించు, నార్తి పెంచు,
క్రూరజనుల మైత్రి కుష్ఠురోగమ్మురా
లలితసుగుణజాల! తెలుగుబాల!!

 
చెడ్డవారితో చేసే స్నేహం ఎలాంటి ఉపద్రవాలను మిగులుస్తుందో చెప్పుకువస్తున్నారు ఈ పద్యంలో. అది మన విచక్షణని దెబ్బతీస్తుందట, శరీరానికీ చెరుపు చేస్తుందట, ఉన్న పేరు కాస్తా ఊడ్చిపెట్టుకుపోతుందట, మనసులో ఎంతకీ తరగని అలజడి మొదలవుతుందట... అంతదాకా ఎందుకు దుర్మార్గుడితో స్నేహం కుష్టురోగంతో సమానం అంటున్నాడు శతకకారుడు.

 

-నిర్జర