ఈ మూడు నక్షత్రాలవారికి చంద్రగ్రహణం రోజున ఉన్న దోషాలను తొలగించుకోవటం ఎలా..?

 

ఈ మూడు నక్షత్రాలవారికి చంద్రగ్రహణం రోజున ఉన్న దోషాలను తొలగించుకోవటం ఎలా..?

 

 

ఈ సంవత్సరం ఆషాడశుద్ధ పౌర్ణమి అనగా తేది: 16. 7. 2019 మంగళవారం ఉత్తరాషాడ నక్షత్రయక్తు చంద్రగ్రహణం పట్టును. ఈ గ్రహణం రాత్రి 1:30 ని" ప్రారంభమైన తెల్లవారు జామున 4 : 29 ని " వరకు ఉండును. ఈ గ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు రాత్రి 8 : 00 గం" ల... లోపల నిత్య భోజనం ముగించుకోవాలి. ఈ గ్రహణం ఉత్తరాషాడ నక్షత్రం మరియు ధనుర్ రాశి, మకర రాశులందు సంభవిస్తున్నందు వలన ఉత్తారాషాడ నక్షత్ర జాతకులు మరియు మకరరాశి చూడరాదు. 

ఈసారి ఏర్పడుతున్న చంద్రగ్రహణం దేశం అంతా కనిపిస్తుందని చెబుతున్నారు. అంటే గ్రహణ ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నమాట. మరి ఆ గ్రహణ ప్రభావాన్ని తప్పించుకునేందుకు, దాన్ని మనకి అనుకూలంగా మార్చుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా!

- గ్రహణ సమయంలో అల్ట్రావైలట్ కిరణాలు ఎక్కువగా ప్రసరించే అవకాశం ఉందని పెద్దలు నమ్ముతారు. ఇవి మన జీర్ణశక్తి మీద ప్రభావం చూపుతాయట. అందుకే గ్రహణానికి నాలుగు గంటల ముందే భోజనం చేయాలని అంటారు. దీని వల్ల గ్రహణం ఏర్పడే సమయానికి మనం తినే ఆహారం పూర్తిగా అరిగిపోతుంది.

- నీరు, ఆహారపదార్థాల మీద గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుందని చెబుతారు. అందుకే గ్రహణం సమయంలో ఎలాంటి వంటపనులూ చేయకూడదు. గ్రహణం పూర్తయిపోయాక, తలార స్నానం చేసిన తర్వాతే వంట పనులు చేసుకోవాలి.

- గ్రహణం ప్రారంభం కావడానికి ముందు ఆహారపదార్థాలు, నీరు ఉన్న బిందెలు మీద దర్భలు ఉంచాలని చెబుతారు. వీటితో పాటు పూజగదిలో కూడా దర్భలు ఉంచాలి. గ్రహణం నుంచి వెలువడే అల్ట్రావైలెట్ కిరణాలను ఈ దర్భలు నిరోధిస్తాయన్నది పెద్దల మాట.

- గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో వండటం, తరగడం, తినడం వంటి పనులు చేయకూడదు. అసలు కత్తి చేతితో పట్టుకోకూడదని చెబుతారు. గర్భిణిలు గ్రహణాన్ని కూడా చూడకూడదన్నది ఓ నియమం. అందుకే గ్రహణం సమయంలో పడుకునే ఉండమని వీళ్లకు చెబుతుంటారు.

- ఈ గ్రహణం రోజున ఉత్తారాషాడ, శ్రవణం, ధనిష్ఠ ఈ నక్షత్ర జాతకులు నక్షత్ర జపం మరియు చంద్రగ్రహ జపం చేయుంచుకోవాలి. మరుసటి రోజు ఉదయం తలంటు స్నానం చేసి శివాలయమునకువెల్లి శివునకు అభిషేకం మరియు బ్రాహ్మణులకు బంగారం, వెండి, రాగిపాత్ర, వెండి సర్పం, ఆవునెయ్యి, బియ్యం, ఉలవలు, స్వయంపాకం, దానం చేసిన ఎడల శాంతి చేకురును.

- గ్రహణం సమయంలో ఏదన్నా మంత్రాన్ని జపిస్తే వందరెట్లు ఫలితం దక్కుతుందని చెబుతారు. అందుకే గ్రహణం పట్టువిడుపుల మధ్య ఉన్న సమయంలో, మనకి నచ్చిన ఏదో ఒక మంత్రాన్ని జపిస్తే మంచిది. అయితే దీనికోసం గ్రహణం ముందూ, తర్వాత కూడా తలస్నానం చేయాలి.

- గ్రహణం సమయంలో గుళ్లని మూసివేస్తారు. మర్నాడు సంప్రోక్షణ జరిగిన తర్వాత కానీ గర్భగుడి తలుపులు తీయరు. కాబట్టి... గ్రహణం రోజున గుడికి వెళ్లి ఉపయోగం లేదు.