గర్భిణీ స్త్రీలు శివలింగాన్ని పూజించవచ్చా.. నియమాలు తెలుసా!
గర్భిణీ స్త్రీలు శివలింగాన్ని పూజించవచ్చా.. నియమాలు తెలుసా!
గర్భధారణ సమయంలో పూజలు, ప్రార్థనల విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి. అలాగే గర్భవతులు కొందరు దేవతలను పూజించవచ్చని, కొందరిని పూజించకూడదని కూడా చెబుతుంటారు. అయితే గర్భవతులు భగవంతుడితో అనుసంధానం అయి ఉండటం వల్ల వారిలో ఆధ్యాత్మికత, భక్తి కారణంగా మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అలాగే కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద చాలా మంచి ప్రభావం ఉంటుంది. గర్బం దాల్చినప్పుడు గర్భిణీ స్త్రీ ప్రవర్తన బిడ్డపై కూడా ఇదే ప్రభావాన్ని చూపుతుందని చెబుతారు. ఈ కారణంగా గర్భిణీ స్త్రీలు శారీరకంగా ఎక్కువ అలసిపోకుండా ఉండేలా పూజలు చేయవచ్చని, మంత్రాలను కూడా పఠించవచ్చని, భగవద్గీతను పఠించవచ్చని పెద్దలు, పండితులు చెబుతారు.
కానీ శివలింగాన్ని పూజించే విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలు శివలింగాన్ని పూజించకూడదని కొందరు నమ్ముతారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
గర్భధారణ సమయంలో శివలింగ ఆరాధన..
శివుడిని పూజించడం వల్ల భక్తులకు అన్ని రకాల సమస్యలకు పరిష్కారాలు, రక్షణ, శాంతి లభిస్తాయి. అంతేకాదు.. శివుడిని పూజించడానికి కఠినమైన నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. ఆయన ఎలాంటి నియమాలు పాటించకపోయినా కేవలం భక్తి ద్వారా సంతృప్తి పడిపోతాడు. అందుకే శివ లింగాన్ని గర్భవతులు కూడా పూజించవచ్చు.
అయితే గర్భవతులు తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సరళమైన పద్దతిలో శివలింగాన్ని పూజించాలి. కఠినమైన నియమాలు పాటిస్తూ పూజ చేయడం నిషేధం. పురాణ గ్రంథాలలో కూడా శివలింగాన్ని పూజించడానికి ఎలాంటి నిబంధనలు విధించలేదు.
గర్భవతులు శివలింగాన్ని పూజిస్తే..
గర్భధారణ సమయంలో స్త్రీ శరీరం మాత్రమే కాకుండా వారి మానసిక ఆలోచనలు కూడా మార్పులకు లోనవుతాయి. ఈ సమయంలో మహిళలు కొన్నిసార్లు ఒత్తిడికి గురవుతుంటారు, కొన్నిసార్లు చాలా భావోద్వేగానికి గురవుతారు.ఈ సమయంలో శివలింగ పూజ వల్ల మానసిక ఆరోగ్యం, ప్రశాంతత లభిస్తాయి. ఆందోళన తగ్గుతుంది.
గర్భధారణ సమయంలో శివలింగాన్ని పూజించడం వల్ల బిడ్డను ప్రతికూల శక్తి నుండి కాపాడుకోవచ్చు. గ్రహ ప్రభావాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది తల్లి, బిడ్డ ఇద్దరికీ మంచి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుంది.
గర్భతులు శివలింగ పూజ చేసేటప్పుడు ఇలా చేయాలి..
ఏ దేవుడు కూడా శరీరాన్ని కష్టపెట్టుకుని, హాని కలిగే విధంగా తనను ఆరాధించమని చెప్పడు. అందుకే దైవాన్ని ఆరాధించే విదానం భక్తులకు కూడా ఆరోగ్యకరమైన రీతిలో ఉండాలి.
గర్భవతులు శివలింగాన్ని పూజించేటప్పుడు ఎక్కువ సేపు నిలబడం చేయకూడదు. హాయిగా కూర్చుని పూజ చేయవచ్చు. నేలపై కూర్చోలేని వారు కుర్చీ లేదా చిన్న టేబుల్ పై కూర్చుని పూజ చేయవచ్చు.
గర్భవతులు కఠినమైన ఉపవాసాలతో, నియమాలతో పూజలు చేయకూడదు. శివలింగానికి నీటితో అభిషేకం, బిల్వపత్రాల సమర్పణ, పండ్లు నైవేద్యం పెట్టడం వంటివి చేసి పూజించుకోవచ్చు. కష్టపడి నైవేద్యాలు, ఉపవాసాలు, బరువు మోయడం వంటివి చేయడం మంచివి కాదు.
గర్భవతులు మెట్లు, ఎత్తైన ప్రదేశాలు ఎక్కడం వంటివి చేయకూడదు. గుడికి వెళ్ళలేని వారు ఇంట్లోనే మూడు అంగుళాల పరిమాణంకు మించని శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు.
*రూపశ్రీ.