రహస్యంగా చేసే ఈ దానాలు ఎంత శక్తివంతమైనవో తెలుసా.. ఏ దానాలు ఏ ఫలితాలు ఇస్తాయంటే!

 

రహస్యంగా చేసే ఈ దానాలు ఎంత శక్తివంతమైనవో తెలుసా.. ఏ దానాలు ఏ ఫలితాలు ఇస్తాయంటే!

ప్రపంచంలోని ప్రతి మతం ఇతరులకు సహాయపడమని,  అవసరమైన వారికి చేయూత ఇవ్వమని చెబుతాయి. ఈ సహాయానికి ఒక్కో మతం ఒక్కొక్క పేరుతో పిలుస్తుంది.  హిందూ ధర్మంలో ఇతరులకు సహాయపడటాన్ని, ఏదైనా ఇవ్వడాన్ని దానం అని అంటారు.  దానం అంటే దయతో ఇతరులకు ఇవ్వడం. హిందూ మతంలో చాలా రకాల దానాలు కూడా ఉన్నాయి. వీటిలో రహస్య దానం గురించి చాలా విశిష్టంగా చెబుతారు. ఇలా దానం చేయడం అనేది మంచి పనిగా చెబుతారు. దానాలు చేయడం మంచి కర్మలకు, జీవితంలో సానుకూల మార్పులకు సహాయపడుతుందట. ఇది మాత్రమే కాకుండా రహస్య దానాలు చేయడం చాలా శక్తివంతమైనది అంటున్నారు. అలాగే ఏవి రహస్యంగా దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటంది? దీని గురించి తెలుసుకుంటే..

దృష్టి దోషానికి..

దృష్టి దోషానికి , మనస్సులోని గందరగోళాన్ని తగ్గించుకోవాలనుకుంటే, మట్టి దీపాలను దానం చేయాలి. వాటిని ఏదైనా దేవాలయంలో లేదా పుణ్యక్షేత్రంలో 5, 11, లేదా 21 అని లెక్కపెట్టి దానం చేయాలి. ఇది  జీవితంలోని గందరగోళాన్ని తగ్గిస్తుంది. జీవితంలో ఒక కొత్త మార్గం తెరుచుకోవడం జరుగుతుంది.  అయితే ఇలా దానం చేసిన తర్వాత అందరికీ చెప్పుకోకూడదు.

ఉప్పు..

ఉప్పు దానం చేయడం అత్యంత పుణ్యకార్యంగా పరిగణించబడుతుంది. ఉప్పు దానం చేయడం అనారోగ్యాలను నివారిస్తుందని, కుటుంబాన్ని చెడు దృష్టి నుండి కాపాడుతుందని నమ్ముతారు. ఎక్కడైనా అన్నదానం చేసే ప్రదేశాలలో,  దేవాలయం లేదా ఎక్కడైనా సాముహికంగా వంటలు చేసి ప్రజలకు పెట్టే ప్రదేశాలలో ఉప్పును దానం చేయవచ్చు.

గొడుగు..

 ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, దానిని తగ్గించుకోవడానికి గుడికి గొడుగును దానం చేయవచ్చు. దానిని బంగారం, వెండి లేదా పువ్వులతో తయారు చేసి దానం చేయవచ్చు. దీనివల్ల  సమస్యలు తగ్గుతాయి. గొడుగు దానం చేయడం వల్ల  ఇల్లు మొత్తం అన్ని వేళలా సురక్షితంగా ఉంటుందట.

ఆసనం..

 గుడికి ఒక ఆసనాన్ని దానం కూడా చేయవచ్చు. ఈ దానం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది ఏకాగ్రతను పెంచి, మెరుగైన పనితీరుకు దారితీస్తుంది. అంతేకాకుండా ఇది  సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది.

పైన చెప్పుకున్న నాలుగు వస్తువులను దానం చేయడానికి ప్రయత్నించడం చాలా మంచిది. ఇది  జీవితంలోని ఎలాంటి సమస్యలనైనా సులభతరం చేస్తుంది. అలాగే మరింత మంచి పనులు చేయడానికి మార్గాలు కూడా దొరుకుతాయి. అందువల్ల, సరైన సమయం , రోజున ఈ రహస్య దానాలు చేయవచ్చు. అలాగే వీటిని పండుగ రోజున కూడా దానం చేయవచ్చు. అయితే ఈ వస్తువులను దానం చేసినట్టు ఎవరికీ చెప్పకపోవడం మంచిది.

                            *రూపశ్రీ.